వంశీ చెప్పిన ఆ మహిళ ఎవరు?

Update: 2019-11-15 05:18 GMT
ఇప్పటి వరకూ ఎప్పుడూ వార్తల్లో వినిపించని.. చర్చకు రాని ఒక సంచలన అంశాన్ని ప్రస్తావించారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటీడీపీ కి గుడ్ బై చెప్పేసిన ఆయన.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాని కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వాని కి సపోర్ట్ చేయాలని తాను అనుకుంటున్నానని చెప్పిన ఆయన.. ఊహించిన రీతి లో ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు మీదా.. టీడీపీ లో కీలక భూమిక పోషిస్తున్న దేవినేని ఉమ లాంటి కొందరు నేతల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన నోటి వెంట కొత్త మాట ఒకటి వినిపించింది. రాష్ట్రం లో అత్యంత పెద్ద కుటుంబానికి చెందిన ఒక మహిళ కు 10వేల కు పైగా ఈ-మొయిల్స్ పెట్టారని.. తర్వాత తప్పు అయిందని వెళ్లి కాళ్ల మీద పడ్డారన్నారు.

ఇలా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయటానికి సైతం టీడీపీ నేతలు వెనుకాడరన్నారు. తాజా గా వంశీ నోటి నుంచి వచ్చిన ఆ పెద్దింటి మహిళ ఎవరన్నది ఒక ప్రశ్న అయితే.. అలాంటి పాడు పని చేసిన నేత ఎవరు? అన్నది మరొకటి ఆసక్తి  కర ప్రశ్న గా మారింది. మహిళ వివరాలు బయట కు రాకున్నా.. అలా మహిళల్ని వేధించే సదరు నేత ఎవరు? అన్న విషయాన్ని బయట పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. మరీ.. విషయంలో వంశీ స్టాండ్ ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News