భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఇక జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లే. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తోట చంద్రశేఖర్ కు అప్పగిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. దీంతో ఏపీ బీఆర్ఎస్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్లనుంది. ఇక మిగతా రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించేందుకు కేసీఆర్ వ్యూహం పన్నుతున్నాడు. ఈ తరుణంలో అసలు తెలంగాణ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎవరు..? అనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కొనసాగారు. అయితే బీఆర్ఎస్ గా అవతరించిన తరువాత తెలంగాణలో కాకుండా ఏపీలో అధ్యక్షుడిని ప్రకటించారు.కానీ సొంత రాష్ట్రంలో అధ్యక్షుడిని ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ బాధ్యతలను కేటీఆర్ కు ఇస్తారా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. మొదటగా దేశ రాజధాని ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి నాయకులు వచ్చారు. అంతేకాకుండా కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో జేడీఎస్ కు మద్దతుగా బీఆర్ఎస్ ప్రచారం చేస్తుందని ప్రకటించారు. అయితే ఆ రాష్ట్రంలో అధ్యక్షుడు ఎవరనేది ఇంకా ప్రకటించలేదు. అలాగే బీహార్, యూపీల నుంచి కూడా బీఆర్ఎస్ లో చేరే వారు ఇప్పటికైతే కానరావడం లేదు.
కానీ ఏపీ నుంచి మాత్రం బీఆర్ఎస్ వైపు ఎక్కువ మంది చూస్తున్నారు. అందుకు కారణమేంటో అందరికీ తెలిసిందే. కొందరు అక్కడి పార్టీలు నచ్చక గులాబీ కండువా కప్పుకుంటే.. మరికొందరు ఆర్థిక ప్రయోజనాల కోసమని అంటున్నారు.
అయితే బీఆర్ఎస్ కు ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన కేసీఆర్ తెలంగాణకు ఎవరో తేల్చలేదు. పార్టీ కేడర్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కేటీఆరే బీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతారని అంటున్నారు. మొన్నటి వకు టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ కొనసాగారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్రమంతటా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను చూసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు కూడా ఆయనే వ్యవహరిస్తారని అంటున్నారు.
కేటీఆర్ ను కాదని ఇతర నాయకులకు అప్పగిస్తే భవిష్యత్ లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ఏ నాయకుడికి ప్రాధాన్యం ఇచ్చినా ఇతర నాయకుల్లో అసంతృప్తి పేరుకుపోతుంది. దీంతో పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ను నియమిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి కేటీఆర్ ను అధ్యక్షుడిగా ప్రకటించడంలో ఇంకా ఆలస్యం ఎందుకు చేస్తున్నారనేది సస్పెన్ష్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.