కరోనా వైరస్ మహమ్మారి జోరు ఇంకా పూర్తిగా తగ్గిపోకమునుపే బ్రిటన్ లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తూ మొత్తం ప్రపంచదేశాలని ఆందోళనకి గురిచేస్తుంది. అయితే , తాజాగా దీనిపై ప్రపంచ సంస్థ ఓ ప్రకటన వెల్లడించింది. బ్రిటన్ లో బెంబేలెత్తిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ అదుపులోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం అమలులో ఉన్న విధానాలతో ఆ వైరస్ దూకుడు ను అడ్డుకోవచ్చు అని డబ్ల్యూహెచ్ వో చెప్పింది. 3
బ్రిటన్ లో కొత్త కరోనా శరవేగంగా విస్తరిస్తున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో స్పందించింది. కొత్త వైరస్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్రస్తుతానికి మాత్రం కంట్రోల్ లోనే ఉన్నదని డబ్ల్యూహెచ్ వో ఎమర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు. అదుపులోనే ఉందంటే.. దాన్ని అలాగే వదిలేయలేమని ఆయన అన్నారు. బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మాట్ హాన్ కాక్ కొత్త వైరస్ గురించి ఇటీవల హెచ్చరిక చేసిన విషయం తెలిసిందే. కొత్త రకం కరోనా అదుపు తప్పినట్లు ఆయన అన్నారు. ప్రధాన వైరస్ స్ట్రెయిన్ కన్నా.. కొత్త రకం కరోనా సుమారు 70 శాతం వేగంగా విస్తరిస్తున్నట్లు మంత్రి మాట్ హాన్ కాక్ తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న వైరస్ నియంత్రణ ఆంక్షలు కరెక్ట్ గా ఉన్నాయన్నారు. లండన్ లో కరోనా న్యూ స్ట్రైయిన్ విజృంభిస్తుండటంతో పలు యూరోపియన్ దేశాలు బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాయి. భారత దేశం కూడా యూకే విమానాలపై నిషేధం విధించింది.