ప్రపంచంలో కరోనా జోరు గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది. కరోనా మొదటగా చైనా లోని వ్యుహన్ సిటీలో పుట్టుకొచ్చింది అంటూ పలు దేశాలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో చైనాలోని వూహాన్‌లో కరోనా వైరస్ మూలాలను కనుక్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యులు అధ్యయనం మొదలు పెట్టారు. అసలు కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందన్న విషయాన్ని నిర్ధారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన 14 మంది సభ్యుల నిపుణుల బృందం ఆదివారం చైనాలోని వూహాన్ లో ఉన్న హూనన్ సీఫుడ్ మార్కెట్ ను పటిష్టమైన భద్రత మధ్య సందర్శించింది.
2019లో కరోనా వైరస్ ఇక్కడే తొలిసారిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించిందన్న విమర్శలు ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ మార్కెట్‌లో సముద్ర ఉత్పత్తులతోపాటు రకరకాల జంతువుల మాంసాన్ని విక్రయిస్తుంటారు. ఇక్కడ విక్రయించే గబ్బిలాలు నుంచే కరోనా వైరస్ పుట్టిందన్న వాదన ఉంది. అయితే, దీన్ని చైనా ప్రభుత్వం అంగీకరించడం లేదు. తాము ఈరోజు ముఖ్యమైన ప్రాంతాన్ని సందర్శించామని నిపుణుల బృందం తెలియజేసింది. కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఈ పర్యటన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు తెలిపింది. 2019 డిసెంబర్‌లో వూహాన్ లో కరోనా కేసులు బయటపడిన తర్వాత ఈ మార్కెట్ ను మూసివేసి, శుభ్రం చేశారు.
కరోనా వైరస్ వచ్చిన తొలి రోజుల్లో రోగులకు చికిత్స చేసిన వూహాన్ లో జిన్యింతన్ ఆస్పత్రిని శనివారం సందర్శించారు. చైనా శాస్త్రవేత్తలతో కలిసి మాట్లాడారు. జం తువుల ఆరోగ్యం, వైరాలజీ, ఫుడ్ సేఫ్టీ, ఎపిడిమాలజీలో నిపుణులతో కలిసి చర్చించారు. వైరస్ పుట్టుకకు గల కారణాలపై అన్ని వైపుల నుంచి అధ్యయనం చేస్తున్నారు. ఈ బృందంలో వివిధ రంగంలో నిష్ణాతులైన 10 మంది సభ్యులున్నారు. కరోనా కి గల కారణమైన ఏ అంశాన్ని వదలకుండా అన్ని వైపుల నుంచి డబ్ల్యూహెచ్ ఓ బృందం పరిశీలిస్తోంది అని డబ్ల్యూహెచ్ ఓ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ పై చైనా ముందస్తుగా ప్రపంచ దేశాల్ని హెచ్చరించలేదని, ఉద్దేశపూర్వకంగానే వైరస్ ను వ్యాప్తి చేసిందని ఆరోపణలున్నాయి.