రాహుల్ చెప్పాడు... రేవంత్ పాటించాడు

Update: 2019-06-29 11:59 GMT
తెచ్చిపెట్టుకున్న గాంభీర్యతను నిలుపుకోవడానికి కాంగ్రెస్ శతధా ప్రయత్నిస్తోంది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఐదేళ్లలో పది సీట్లలో కూడా మెరుగుపడకపోవడంతో... తనదే బాధ్యత అంటూ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అయితే... పార్టీకి నాయకత్వం వహించడానికి తాను తగిన వాడిని కాదంటూ తప్పుకున్నారు. అదే సమయంలో కీలక బాధ్యతల్లో ఉన్నవారు కూడా పునరాలోచించుకోవాలని సూచించడంతో చాలా చోట్ల కీలక నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తన పార్టీకి రాజీనామా చేశాడు.

రాజీనామా చేసిన అనంతరం రేవంత్ మాట్లాడుతూ మా నాయకుడిని అనుసరించి పార్టీ భవిష్యత్ ప్రయోజనాల కోసమే రాజీనామా చేశానని ఆయన వెల్లడించారు. పార్టీకి సేవ చేయడానికి పదవి అవసరం లేదని భావిస్తున్నాను. కీలక బాధ్యతల్లో ఉండి తగినంత న్యాయం చేయలేనపుడు ఒక కార్యకర్తలా పార్టీ అభివృద్ధికి పాటుపడతాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ఓటమికి తనతో పాటు మిగతా నేతలు కూడా బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూ తాను రాజీనామా చేశారు. అయితే, ఆయన ఉపసంహరించుకుంటారు అనుకున్నారు ఇతర నేతలు. ఇక ఆయన పట్టు వీడకపోవడంతో వీరంతా ఇపుడు పదవులు వీడుతున్నారు.

మరి రేవంత్ తనంతట తాను పదవికి రాజీనామా చేశారు. రేవంత్ ఆ పదవిలో ఉండటంపై బలవంతపు అసంతృప్తులు ఏమీ లేవు. మరి ఇప్పటికే ఎంతో మంది వ్యతిరేకించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి ఎపుడు రాజీనామా చేస్తారో చూడాలి. తెలంగాణలో ఇప్పటివరకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, రేవంత్ నాయకుడి మాట పాటించారు... మరి ఇంకా ఎంత మంది పాటిస్తారో. ఉన్నవాళ్లందరూ పదవులు వదులుకుని యువకులకు, మరింత సమర్థులకు పదవులు అప్పగించాలన్నది రాహుల్ ఆలోచన.

    

Tags:    

Similar News