అసెంబ్లీ నియోజకవర్గం : పెడన
టీడీపీ: కాగిత వెంకటకృష్ణప్రసాద్
వైసీపీ: జోగి రమేశ్
కృష్ణా జిల్లాలో కరువుతో కొట్టుమిట్టాడుతున్న నియోజకవర్గాల్లో పెడన ఒకటి. ఇక్కడి నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.2009లో కాంగ్రెస్‌ను గెలిపించి.. 2014లో టీడీపీని గెలిపించారు. ఈసారి ఏ పార్టీ గెలుస్తుందోనని ఆసక్తిగా మారింది.
* పెడన చరిత్ర :
మండలాలు:పెడన, గూడురు, బంటుమిల్లి, గుత్తివెన్ను
ఓటర్లు:లక్షా 45 వేలు
కృష్టా డెల్టాలో చివరి ప్రాంతం కావడంతో పెడన నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ తాగునీరు సమస్య తీవ్రంగా ఉంది. పెడన లాంటి మండల కేంద్రాల్లో వాటర్ ట్యాంకు నీరే దిక్కని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలుపొందిన జోగి రమేశ్.. 2014లో కూడా పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన కాగిత వెంకట్రావ్ ప్రాతినిథ్యం వహించారు. అయితే ఏ నాయకుడు తమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదని వారంటున్నారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లో జోగిరమేష్ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగగా.. టీడీపీ నుంచి కాగిత వెంకట్రావ్ కుమారుడు వెంకటకృష్ణ ప్రసాద్ పోటీపడుతున్నారు.
* అధికార టీడీపీ అండదండలతో వెంకటకృష్ణ ప్రసాద్
2014 ఎన్నికల్లో గెలిచిన కాగిత వెంకట్రావ్ కుమారుడే కాగితపు వెంకటప్రసాద్ తండ్రి ప్రోద్బలంతో ఈసారి బరిలో నిలుస్తున్నారు. బలమైన జోగిరమేష్ ను తట్టుకుంటాడో లేదో చూడాలి. ఐదేళ్లలో నియోజకవర్గానికి కాగిత వెంకట్రావ్ చేసిందేమీ లేదని సొంత పార్టీలోనే అసంతృప్తులు మొదలయ్యాయి. ఈ ప్రభావం వెంకటప్రసాద్‌పై పడనుంది. అంతేకాకుండా తండ్రి ఆరోగ్య కారణాల రీత్యా పోటీలో లేకపోవడంతో కొత్తగా కృష్ణప్రసాద్ యాక్టివ్ గా మారాడని తెలుస్తోంది. అయితే తండ్రిని మరిపించేలా పాలన చేస్తాడా. సద్వినియోగం చేసుకోవడం లేదని టాక్. ఇక వెంకటప్రసాద్ కు తండ్రి వలే ఎవరూ సహకరించడం లేదట.. అసమ్మతి వెంటాడుతోంది. కార్యకర్తలు సహకరించకపోవడంతో ఒంటరిగా పోరాడుతుండడం మైనస్ గా మారింది.
* అనుకూలతలు:
-నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం
-ఐదేళ్లలో చేసిన అభివృద్ధి పనులు
* ప్రతికూలతలు
-సొంతపార్టీలోనే అసమ్మతి
-కార్యకర్తలు సహకరించకపోవడం
* బలమైన జోగి రమేశ్ ఈసారి పక్కేనా?
2009లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా పనిచేసిన జోగి రమేశ్ ఆ తరువాత 2014 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. ఆయన సొంత నియోజకవర్గం మైలవరంలో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనను మళ్లీ పెడన నుంచి పోటీ చేయమని జగన్ కోరడంతో జోగి రమేశ్ కూడా సై అన్నారు. పార్టీ తరుపున మంచి ఫాలోయింగ్ ఉన్న రమేశ్ కు పార్టీ అండదండలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీని అభివృద్ధి చేసిన ఉప్పాల రామ్ ప్రసాద్ సపోర్టు కూడా ఉంది.వైసీపీలో బలమైన నాయకుడిగా ఉండడం, వాక్చాత్యుర్యం.. జనంలోకి మాస్ లీడర్ గా వెళ్లడం ఈయనకు ప్లస్. వివిధ సమస్యలపై జోగి స్పందిస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈసారి జోగి రమేష్ గెలుపు పక్కా అని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. కానీ పెడనలో బలమైన వైసీపీ నేత అయిన ఉప్పాల మద్దతు అనుమానంగా ఉండడం మైనస్ గా ఉంది.
అనుకూలతలు:
-నియోజకవర్గంలో పార్టీ బలపడడం
-గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
-కాగిత వెంకటకృష్ణ ప్రసాద్ పై పెరిగిన అసంతృప్తి
ప్రతికూలతలు:
-ఉప్పాల మద్దతుపై అనుమానాలు
-సొంత నియోజకవర్గం కాకపోవడం
*జోగికే మొగ్గు
చివరిగా కాగిత వెంకట్రావ్ కుమారుడు వెంకట కృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో యాక్టివ్ లేకపోవడంతో ఆయన కుమారుడు యువనేత కృష్ణప్రసాద్ ఈసారి గెలుస్తాడా..? లేదా..? అనే అనుమానాలు ఎక్కువగానే ఉన్నాయి. వెంకట్రాప్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ ప్రజలు ఆయన కుమారుడిని గెలిపిస్తారో లేదో చూడాలి. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ ఈసారి ఎలాగైనా గెలిచేలా రకరకాల స్కెచ్‌లు వేస్తున్నాడు. మొత్తంగా జోగికే కాస్త మొగ్గు పెడనలో కనిపిస్తోంది.