మోహన్ బాబు ఎవరిని టార్గెట్ చేశారు?

Update: 2022-03-20 05:30 GMT
తాను చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డానని.. స్వతహాగా ఎదిగానని.. నా కష్టాలు నా బిడ్డలకు రాకూడదనే ఇప్పుడు పాటుపడుతున్నానని నటుడు, నిర్మాత మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు. విద్యానికేతన్ వార్షికోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురైన మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబు బ్లాస్టులు, బ్రతకడం..రాజకీయాల్లో రాళ్లదెబ్బలు తిన్నానని.. నా కష్టాలపై ఒక పుస్తకం రాయవచ్చని మోహన్ బాబు అన్నారు.

'నేను ఇతరులకు ఉపయోగపడ్డాను కానీ..నాకెవరూ ఉపయోగపడలేదు స్వామి.. ఎంతో మంది రాజకీయ నాయకులు తనను పిలిపించుకొని వాళ్ల పార్టీల తరుఫున ప్రచారం చేయించుకున్నారు కానీ.. నాకు వాళ్ల సహాయం ఎప్పుడూ అడగలేదు.. వాళ్లు ఇవ్వరు కూడా..' అని మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఒక్క ఎన్టీ రామారావుతో 'మేజర్ చంద్రకాంత్ ' సినిమా తీసి మళ్లీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని కుర్చీలో కూర్చొబెట్టి.. ఆయన నన్ను రాజ్యసభకు పంపించారు తప్ప ఎవరూ తనకు సాయం చేయలేదని మోహన్ బాబు అన్నారు. రాజకీయాల్లో తనను వాడుకున్నారని.. మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పిందని.. జీవితం వయసు అయిపోయే కొద్దీ ఎన్నో అనుభవాలు నేర్పుతుందని.. జీవితం గురించి తెలుస్తుందని మోహన్ బాబు వైరాగ్యపు మాటలు మాట్లాడారు. 30 ఏళ్ల కష్టం విద్యానికేతన్ మోహన్ బాబు యూనివర్సిటీగా మారిందని అన్నారు.

కాగా మోహన్ బాబు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయనను రాజకీయాల్లో వాడుకొని మోసం చేసింది ఎవరన్న చర్చ సాగుతోంది. చంద్రబాబు గురించా? లేదా జగన్ గురించి ఈ మాటలు మోహన్ బాబు అన్నారా? అన్నది తేలాల్సి ఉంది. మొత్తానికి విద్యానికేతన్ వార్షికోత్సవం సందర్భంగా తనలోని ఆవేదనను వెళ్లగక్కాడు మోహన్ బాబు.



Full View
Tags:    

Similar News