సన్​రైజర్స్​ ఎవరిని వదులుకుందంటే..!

Update: 2021-01-21 01:30 GMT
యూఏఈ వేదికగా సాగిన ఐపీఎల్​ 2020 విజయవంతంగా సాగింది. అయితే ఐపీఎల్​ 2021 పై అప్పుడే హైప్​ క్రియేట్​ అయ్యింది. ఈ సారి ఐపీఎల్​ ఎక్కడ నిర్వహిస్తారన్న విషయంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొన్నది. అయితే ఈ ఐపీఎల్​కు సంబంధించిన మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్టు సమాచారం. దీంతో వివిధ జట్లు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. ఇందులో భాగంగా సన్​రైజర్స్​ హైదరాబాద్​.. స్టాన్ లేక్, సంజయ్ యాదవ్, బవనాక సందీప్​, పృధ్వీ రాజ్, అలెన్ లను జట్టు నుంచి వదులుకుంటున్నట్టు ప్రకటించింది.


దేశీయ అండర్ క్యాప్ ఆటగాళ్లలో సంజయ్ యాదవ్, బవనాక సందీప్, పృథ్వీ రాజ్‌లను ఆరెంజ్ ఆర్మీ రిలీజ్ చేసింది. గత సీజన్లో నెట్ బౌలర్‌గా జట్టులోకి చేరిన పృథ్వీ రాజ్.. భువీ సహా ఇతర బౌలర్లు గాయపడటంతో.. సన్‌రైజర్స్ జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్‌తోపాటు వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టోను సైతం సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. మనీష్ పాండే, విజయ్ శంకర్‌తోపాటు గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై జట్టును గెలిపించిన ప్రియమ్ గార్గ్‌ను సైతం జట్టులోనే పెట్టుకున్నారు.

విరాట్ సింగ్, అబ్దుల్ సమద్ లాంటి యువ హిట్టర్లను రిటైన్ చేసుకుంది. వికెట్ కీపర్లు సాహా, గోస్వామి సైతం జట్టులో ఉండనున్నారు. ఐపీఎల్ 2020లో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన మిచెల్ మార్ష్ స్థానంలో జట్టులోకి తీసుకున్న జేసన్ హోల్డర్‌ను సైతం ఆరెంజ్ ఆర్మీ తీసుకున్నది. ప్రస్తుతం సన్‌రైజర్స్ దగ్గర రూ.10.75 కోట్ల పర్సు మనీ ఉండగా.. వేలంలో ఇద్దరు విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు భారత క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఆరెంజ్ ఆర్మీకి ఉంది.


Tags:    

Similar News