ఆన్ లైన్ కరెన్సీ అయిన క్రిఫ్టో కరెన్సీకి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. పేపర్ లేదా సంప్రదాయ దేశాల కరెన్సీకి బదులుగా ప్రపంచవ్యాప్తంగా ఇది వాడుకలో ఉంది. ‘బిట్ కాయిన్’ లేదా క్రిప్టోకరెన్సీ గా పిలవడే దీన్ని కొన్ని దేశాలు ఆమోదించకున్నా.. దీన్ని కొనడం మాత్రం ఆపడం లేదు. మొన్నటివరకు అమెరికా డాలర్ ను మించి ఇదీ రికార్డులు సృష్టిస్తూ పరిగెడుతోంది. ఒక బిట్ కాయిన్ విలువ 70వేల డాలర్లు దాటిపోయింది.
2003 నుంచి క్రిప్టో కరెన్సీ వాడుకలో ఉంది. ఇటీవల కాలంలోనే దీని విలువ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. భారత దేశంలో ఇంతవరకు దీనిపై నిషేధం విధించలేదు. అయితే దేశంలో బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీకి ప్రభుత్వ అనుమతి లేదు. అయినా చాలా మంది అమ్మడం, కొనడం చేస్తున్నారు.
క్రిప్టో కరెన్సీలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ బిట్ కాయిన్ అందరికీ చేరువైంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఈ క్రిప్టో కరెన్సీని అధికారిక కరెన్సీగా గుర్తించలేదు. ఇటీవలే ఎల్ సాల్వేడార్ దేశం క్రిప్టో కరెన్సీని గుర్తించినప్పటికీ ప్రపంచబ్యాంక్ సాంకేతికతను అందించేందుకు నిరాకరించింది. బ్లాక్ చెయిన్ సాంకేతిక ఆధారంగా ఈ కరెన్సీ చెలామణి అవుతుందని సమాచారం. దీనిపై ప్రభుత్వాలకు నియంత్రణ లేకపోవడం గమనార్హం. డిజిటల్ కరెన్సీ రూపంలో ఇది ఉంటుంది.
ఇటీవల ప్రముఖ మోటార్స్ కంపెనీ టెస్లా తమ కార్ల కొనుగోలుకు క్రిప్టో కరెన్సీని అనుమతించబోమని చెప్పడంతో బిట్ కాయిన్ విలువ భారీగా పడిపోయింది. 75వేల డాలర్ల నుంచి ఏకంగా 35వేల డాలర్లకు పడిపోయింది. ఇక క్రిప్టో మైనింగ్ పై చైనాలో ఉక్కుపాదం మోపడంతో క్రిప్టో కరెన్సీ పతనం అవుతూ వస్తోంది. ప్రస్తుతం 35 వేలకు అటూ ఇటూగానే దీని విలువ పడిపోయిందని చెబుతున్నారు.టర్కీ సెంట్రల్ బ్యాంక్ తాజాగా క్రిప్టో కరెన్సీలను, క్రిప్టో ఆస్తుల కొనుగోళ్లను నిషేధించింది. దీంతో బిట్ కాయిన్ విలువ పతనమైంది. టర్కీ నిషేధంతో ఇతర దేశాలు కూడా అదే బాట అనుసరించడానికి రెడీ అవుతున్నాయి. టర్కీ కరెన్సీలో క్రిప్ట్రో కరెన్సీ విలువ గత ఫిబ్రవరిలో 7 బిలియన్ లిరా నుంచి మార్చి 24వ తేదీ మధ్య 218 బిలియన్ లిరా (27 బిలియన్ డాలర్లు)కు పెరిగింది. ఇప్పుడు టర్కీ నిషేధంతో దాని విలువ పడిపోయింది.
ఇక డిజిటల్ కరెన్సీపై ప్రభుత్వాలకు కూడా నియంత్రణ ఉండదు. డిజిటల్ రూపంలో ఉండే ఈ కరెన్సీని మెయింటైన్ చేయడానికి మామూలు కంప్యూటర్ వ్యవస్థ సరిపోదు. డిజిటల్ కరెన్సీకి అనుమతులు ఇవ్వడం వలన విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఫలితంగా ఇప్పటికే పెరిగిపోతున్న కాలుష్యానికి ఇది మరింత అదనంగా కాలుష్యం తోడవుతుంది.
ఇక ఆన్ లైన్ లోనూ క్రిప్టో కరెన్సీని సంపాదించే మార్గాలున్నాయి. వివిధ రకాల ఫజల్స్ కు సమాధానాలు వెలికి తీయడం వల్ల క్రిప్టో కరెన్సీ మీ సొంతమవుతుంది. కానీ ఈ ఫజిల్స్ ను పరిష్కరించడం అంత ఈజీకాదు. చాలా కష్టంతో కూడుకున్న పని. విద్యుత్ వినియోగం భాగా పెరుగుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కరెన్సీని ఆమోదించడానికి ప్రభుత్వాలు, సంస్థలు కూడా వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది.