వ్యభిచారంపై..భారతసర్వోన్నత న్యాయస్థానంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. హర్త అనుమతితో సంబంధం పెట్టుకుంటే...అలాంటి అంశాన్ని వ్యభిచారంగా ఎలా చూడాలని న్యాయస్థానం ప్రశ్నించింది. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 497 ప్రకారం అక్రమ సంబంధం నేరం. కానీ వ్యభిచార నేర చట్టం ప్రకారం కేవలం మగవారిని మాత్రమే దోషిగా పరిగణిస్తారు. ఆ శిక్ష ప్రకారం మహిళలు కేవలం బాధితులు మాత్రమే. విక్టోరియా కాలం నాటి ఆ చట్టాన్ని సవరించాలన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో ఆసక్తికరమైన వాదన జరిగింది. అయితే ఆ అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
అక్రమ సంబంధంపై ఓ పిల్‌లో వేసిన ప్రశ్నలను ఇవాళ సుప్రీం బెంచ్ క్షుణ్ణంగా పరిశీలించింది. అక్రమ సంబంధాల్లో మహిళలే బాధితులని చెప్పడం లింగ వివక్ష కాదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఒకవేళ భర్త అనుమతితోనే భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని భావిస్తే, అది మహిళను ఆటవస్తువుగా చూడడం కాదా అని జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం అడల్ట్రీ అంశంపై విస్తృత స్థాయిలో విచారణ చేపట్టింది. ``అక్రమ సంబంధంలో కేవలం మగవారే నేరస్తులా - మహిళలు అక్రమ సంబంధాన్ని కోరుకోరా, మరొకరి భార్యతో శారీరక సంబంధం పెట్టుకుంటే, కేవలం ఆ వ్యక్తినే జైలుకు పంపించాలా, ఒకవేళ భర్త అంగీకరిస్తే, భార్య మరొకరితో సంభోగం చేయవచ్చా?` అని ఆ పిల్‌లో ప్రశ్నించారు.
అయితే చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిల్ ప్రశ్నలపై విచారణ చేపట్టింది. పాత చట్టాలు మహిళలకు, మగవారికి సమానంగా లేవని స్పష్టం చేసింది. ఐపీసీలోని సెక్షన్ 497ను ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా సమీక్షించాలని సుప్రీం అభిప్రాయపడింది. మళ్లీ నాలుగు వారాల తర్వాత ఈ అంశంపై తదుపరి విచారణ చేపట్టనుంది. కేరళకు చెందిన జోసెఫ్ షైన్ అడల్ట్రీ అంశంపై పిటిషన్ వేశారు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు సమాన హక్కు కల్పిస్తున్నారు, మరి ఓ చట్టం ప్రకారం ఆమెను ఎందుకు తక్కువగా చూస్తున్నారని ఆ పిల్‌లో అతను ప్రశ్నించాడు.