కరణం బలరాం వైసీపీ తీర్థం కన్ఫర్మేనా?

Update: 2018-11-06 04:36 GMT
వైసీపీకి బాగా అనుకూలంగా ఉన్న జిల్లాల్లో ఒకటైన ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య చాలాకాలంగా పచ్చగడ్ఢి వేస్తే భగ్గుమంటోంది. పార్టీలో ముందు నుంచి ఉన్న నేతల మధ్య కొట్లాటలు చాలవన్నట్లుగా వారికి ఫిరాయింపు నేతలు జత కలిశారు. దీంతో ప్రకాశం టీడీపీ గ్రూపు తగాదాలకు అడ్డాగా మారిపోయింది. అలాంటి జిల్లాలో వైసీపీకి చెందిన సీనియర్ నేతతో - టీడీపీ యంగ్ లీడర్ భేటీ కావడం సంచలనంగా మారింది. ఆ భేటీ పరమార్థమేంటో తెలుసుకోవడానికి చంద్రబాబు కూడా జుత్తు పీక్కుంటున్నారట.
   
వైసిపి కీలకనేత బాలినేని శ్రీనివాసరెడ్డి - టిడిపి నేత కరణం బలరాం తనయుడు వెంకటేశ్  ఓ పుట్టినరోజు ఫంక్షన్ లో కలుసుకుని చర్చలు జరిపారని ప్రచారం జరుగుతుంది .  కరణం బలరామ్ కు చాలా కాలంగా జిల్లా నేతలతో ఏమాత్రం పడటం లేదు. చంద్రబాబుతో కూడా మునుపటిలా సఖ్యత లేదు. ఈ మొత్తానికి ఫిరాయింపు ఎంఎల్ ఏ గొట్టిపాటి రవికుమార్ ప్రధాన కారణమన్నది ప్రకాశం టీడీపీలో వినిపించేమాట.  ఎప్పుడైతే గొట్టిపాటి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారో అప్పటి నుండి కరణం - గొట్టిపాటికి గొడవలు మొదలయ్యాయి. మొదటి నుండి పై ఇద్దరు నేతలకు మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. అప్పట్లో ఇద్దరు నేతలు చెరో పార్టీల్లో ఉండేవారు కాబట్టి విభజన స్పష్టంగా ఉండేది. అలాంటిది ఎప్పుడైతే గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారో వారిద్దరి మధ్య గొడవలో మిగిలిన నేతలు ఇరుక్కున్నారు. ముందు జిల్లాలోని నేతల్లో మెజారిటీ కరణంకు మద్దతుగా నిలబడ్డారు. అయితే, చంద్రబాబు - చినబాబులు గొట్టిపాటికి మద్దతుగా నిలబడ్డారో జిల్లాలోని నేతలు కూడా ప్లేటు ఫిరాయించారు. దాంతో కరణం ఒంటరయ్యారు. అప్పటి నుండి జిల్లా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ కరణం మాట ఎక్కడా చెల్లుబాటు కావటం లేదు.
   
దాంతో టిడిపిలో ఉండి ఉపయోగం లేదని కరణం నిర్ణయించుకున్నాట్లు ప్రచారం జరుగుతుంది. అప్పటి నుండి కరణం వైసిపిలో చేరిపోతారనే ప్రచారం మొదలైంది. తాజాగా బాలినేనితో కరణం వెంకటేష్ భేటీ కావటంతో పెద్ద చర్చకు దారితీసింది అని ప్రచారం జరుగుతుంది . ఒకవైపు ఎన్నికలు వస్తుండటం మరోవైపు కరణంకు ఎక్కడికక్కడ చుక్కెదురవుతుండటంతో య భవిష్యత్ పై కరణం బలరామ్ తొందరగా ఏదో ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగానే వెంకటేష్ బాలినేని భేటీ అయ్యుంటారనే ప్రచారం ఊపందుకుంది. చివరకు ఏమవుతుందో చూడాలి.
Tags:    

Similar News