యుక్త వయస్కురాలైనప్పటి నుంచీ నడిమి వయస్సు వరకూ నెలనెలా మహిళల జీవితంలో అతి సాధారణంగా జరిగిపోయే ఒక అతి సంక్లిష్టమైన జీవ ప్రక్రియ రుతుక్రమం. మహిళల శారీరక మార్పులు - ఆరోగ్యంతో ఇది ముడిపడి ఉంటుంది. నడి వయసుకు చేరిన మహిళల్లో 45 నుంచి 55 ఏళ్ల మధ్య మెనోపాజ్ దశ కనిపిస్తుంది. 50 ఏళ్ల వరకు పీరియడ్స్ కొనసాగడం వల్ల స్త్రీల ఆరోగ్యం బాగుంటుంది. 40 ఏళ్ల కన్నా ముందే మెనోపాజ్ వచ్చినట్లయితే ప్రిమెచ్యూర్ మెనోపాజ్ లేదా ఎర్లీ మెనోపాజ్ అంటారు. మెనోపాజ్ దశలో మానసికంగా ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంది. తలనొప్పి కనిపిస్తుంది. పీరియడ్స్ ఆగిపోతాయి. ఆస్టియో ఆర్థరైటిస్ - నడుము నొప్పి వంటివి మొదలౌతాయి. మూత్రంలో మంట - చర్మం పొడి బారుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్థూలకాయం వస్తుంది.
అయితే, మెనోపాజ్ కంటే ముందు కూడా పలు సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు చెప్తున్నాయి. మెనోపాజ్ సంభవించడానికి ముందు ఇదే సమస్యలు కనిపిస్తున్నాయట. ప్రధానంగా లైంగిక కోరికలు తగ్గుతున్నాయని తేలింది. వయసు పెరుగుతున్నకొద్ది మహిళల్లో సెక్స్ సమస్యలు సహజం. అయితే, మెనోపాజ్ దశకంటే ముందే శృంగారాన్ని ఆస్వాదించాలనే ఆసక్తి తగ్గుతోందని నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ మెడికల్ డైరెక్టర్ సీఫనీ ఫౌబియన్ తెలిపారు. మెనోపాజ్ దశలో ఉన్న దాదాపు 4500 మంది మహిళలపై జరిపిన పరిశోధనలో పలు విషయాలు తెలుసుకున్నట్లు సీఫనీ వెల్లడించారు. వయసు మీద పడ్డ తర్వాత జననాంగం పూర్తిగా పొడిబారడం - సెక్స్ సమయంలో నొప్పి రావడం.. శృంగారం పట్ల మహిళలకు విముఖత కలిగేలా చేస్తుందని విశ్లేషించారు. కొద్దిమంది మహిళలు మాత్రమే ఇందుకు చికిత్స తీసుకుంటున్నారని వివరించారు.
మెనోపాజ్ కంటే ముందు ఎదురయ్యే శారీరక - మానసిక సమస్యలు కొందరిని సెక్స్ కు దూరం చూస్తే..భాగస్వామి కారణాలతో మరికొందరు ఈ దశలో సెక్స్‌కు దూరంగా ఉంటున్నారని వెల్లడైంది. మెనోపాజ్ ముందు - మెనోపాజ్ తర్వాత శృంగారంలో పాల్గొనే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్ సీఫనీ వివరించారు.