ఈ టీడీపీ ఎంఎల్ఏలకు ఏమైంది ?

Update: 2021-07-13 06:06 GMT
ప్రకాశం జిల్లాలోని తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏలకు ఏమైందో అర్ధం కావటంలేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తు జిల్లాలోని ముగ్గురు ఎంఎల్ఏలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి ఆదివారం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

అయితే వాళ్ళకు ఏమైందో ఏమో సోమవారం యూ టర్న్ తీసుకున్నారు. సాగు, తాగు నీటికి సంబంధించి తమ జిల్లా గురించే తమ బాధంతా అంటూ మరో లేఖను రాశారు. జిల్లా ప్రజల బాధలను తీర్చటానికి ప్రభుత్వం ఏమి చేస్తోందో చెప్పాలంటే లేఖలో ప్రశ్నించటం గమనార్హం. ఆదివారమేమో అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్నే వ్యతిరేకిస్తున్నట్లు తమ లేఖలో స్పష్టంగా చెప్పారు.

మొదటి లేఖ రాసిన 24 గంటల్లో మూటర్న్ తీసుకుంటు రెండో లేఖ రాయాల్సిన అవసరం ఎంఎల్ఏలకు ఏమొచ్చింది ? ఏమొచ్చిందంటే రాయలసీమ రైంతాంగం నుండి టీడీపీ ఎంఎల్ఏలపై తీవ్ర వ్యతిరేకత మొదలైందని సమాచారం. అలాగే పార్టీలోని రాయలసీమ నేతల నుండి కూడా వ్యతిరేకత మొదలైందట.

నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం విస్తరణ ద్వారా రాయలసీమలోని లక్షలాది ఎకరాలకు సాగు నీటితో పాటు తాగునీరు కూడా అందుతుంది. ఇలాంటి పథకాన్ని అడ్డుకోవాలని తెలంగాణా ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తన రాష్ట్ర ప్రయోజనాల పేరుతో తెలంగాణా ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటోందని అనుకున్నా అర్ధముంది. మరి ఏపిలోని టీడీపీ ఎంఎల్ఏలు కూడా ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారంటే అర్ధమేంటి ? ఈ ఎంఎల్ఏలు రాసిన లేఖ చంద్రబాబునాయుడు మెడకు చుట్టుకుంది.

ఇక్కడే టీడీపీ అందరి ముందు దోషిగా నిలబడాల్సొచ్చిందట. తమ జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చమని అడగటంలో తప్పేలేదు. కానీ అనవసరంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించటం వల్లే మొత్తం టీడీపీనే రైతాంగానికి సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది. మొత్తానికి తెరవెనుక ఏమి జరిగిందో ఏమోగానీ మొదటి లేఖలోని డిమాండ్ నుండి యూటర్న్ తీసుకుంటు రెండో లేఖ రాయాల్సొచ్చింది.
Tags:    

Similar News