తెలంగాణ క‌మ‌లం.. `ప‌సుపు` కొట్టుకు పోవ‌డం ఖాయ‌మేనా?

Update: 2021-03-26 13:30 GMT
వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తున్నాం.. అని ప‌దే ప‌దే చెబుతున్న తెలంగా ణ బీజేపీ నేత‌ల‌కు ఇప్పుడు ప్ర‌జ‌ల నుంచి సూటి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. గ‌త పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో నిజామాబాద్‌లో ప‌సుపు బోర్డును ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చి.. గెలుపు గుర్రం ఎక్కిన బీజేపీ.. ఆ త‌ర్వాత దీనిని అట‌కెక్కించింది. స్పైస్ బోర్డు ఏర్పాటు చేశాం క‌నుక ప‌సుపు బోర్డు ప్ర‌తిపాద‌న త‌మ వ‌ద్ద‌లేద‌ని చెప్పారు.. వాస్త‌వానికి.. దేశ‌వ్యాప్తంగా ఉత్ప‌త్తి అవుతున్న ప‌సుపులో నిజామాబాద్ ప్రాంత రైతాంగానికి 80 శాతం వాటా. ఇక్క‌డ నుంచి ప‌సుపు విదేశాల‌కు కూడా ఎగుమ‌తి అవుతోంది.

ఈ క్ర‌మంలో ఇక్క‌డే ప్ర‌యోగ శాల‌లు, నాణ్యత ప‌రిశీల‌న‌.. ధ‌ర‌ల మదింపు జ‌రిగితే.. త‌మ‌కు గిట్టుబాటు అ వుతుంద‌ని.. త‌మ‌కు ఇక్క‌డ ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయాల‌ని రైతులు కోరారు.. అయితే.. దీనిపై ముందు హామీ ఇచ్చి త‌ర్వాత‌.. ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే రైతులు పెద్ద ఉద్య‌మానికి తెర‌దీశారు.. అయిన ‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఉలుకు ప‌లుకు లేకుండా రాజ‌కీయం చేస్తున్న బీజేపీ.. ఇప్పుడు అనూహ్యంగా ఇదే బోర్డును త‌మిళ‌నాడులో ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డం వివాదానికి దారితీసింది. వాస్త‌వానికి ప‌సుపు ఉత్ప‌త్తిలో త‌మిళుల వాటా కేవ‌లం 5 శాతం మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రూ అక్క‌డ బోర్డు ఏర్పాటు చేయాల‌ని కోర‌డం లేదు.

తమిళనాడులో ఎన్నికల వేళ   పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామంటూ అక్కడ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది. దీంతో బీజేపీ వ్య‌వ‌హార శైలిపై తెలంగాణ రైతాంగం మ‌రీ ముఖ్యంగా నిజ‌మాబాద్ రైతులు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బీజేపీ ప్రాజెక్టులు ప్రకటిస్తోందని విమర్శిస్తున్నారు.  పసుపు బోర్డు తేలేకపోతే రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  నిజామాబాద్‌లో సుగంధ ద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసినందున పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తేల్చి చెప్ప‌డం.. దీనిని అర్వింద్ వ్య‌తిరేకించ‌లేని ప‌రిస్థితిలో ఉండ‌డాన్ని కూడా వారు నిల‌దీస్తున్నారు. ఏతావాతా.. ఇప్పుడు..  బోర్డును త‌మిళ‌‌నాడులో ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో ఈ వివాదం మ‌రింత రాజుకుంది.
Tags:    

Similar News