భర్త వీర్యం అడిగితే నో అనేశారు

Update: 2016-07-11 12:42 GMT
ఒక భార్య విన్నపాన్ని నో చెప్పేశారు వైద్యులు. దేశంలో ఇలాంటి వాటి విషయంలో తామేమీ చేయలేమని తేల్చేసిన వైద్యులు.. ఈ ఉదంతంతో చట్టాన్ని మార్చాల్సిన అవసరంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

 వైద్య వర్గాల్లో ఆసక్తికర చర్చ రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. ఒక యువకుడు ఊహించని రీతిలో మరణించారు. ఈ నేపథ్యంలో అతని వీర్యంలోని శుక్రకణాల సాయంతో తాను గర్భం దాల్చాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిందో భార్య. ఆమె విన్నపాన్ని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యులు తిరస్కరించారు. సంతానం లేని తనకు.. తన భర్తకు గుర్తుగా మరణించిన తన భర్త వీర్యంలోని శుక్రకణాల్ని వేరు చేసి ఇవ్వటం ద్వారా తాను గర్భం దాల్చాలని భార్య చెప్పటం.. ఆమె అత్తమామలు కూడా అందుకు ఓకే చెప్పినప్పటికీ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అలాంటి అవకాశం లేదని తేల్చారు.

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్య కణాల్ని వేరు చేసి.. పోస్ట్ మార్గం స్మెర్మ్ రీట్రైవల్ కు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు దేశంలో ప్రస్తుతం లేకపోవటంతో తామేమీ చేయలేమని వైద్యులు తేల్చేశారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి మృతదేహంలో 24 గంటల పాటు శుక్రకణాలు బతికే ఉంటాయి. ఇక.. మనిషి శరీరంలో నుంచి శుక్రకణాల్ని వేరు చేయటానికి ఐదు నిమిషాలు మాత్రమే పడుతుంది. కాకుంటే.. ఇలా చేయొచ్చా? అన్నది నైతిక అంశాల మీద ఆధారపడి ఉంటుది. ప్రాశ్చాత్య దేశాల్లో ఇలాంటి విధానానికి అనుమతి ఉన్నా.. దేశంలోని చట్టాల ప్రకారం అలాంటి అవకాశం లేదు. దీంతో.. సదరు భార్య విన్నపాన్ని ఎయిమ్స్ వైద్యులు నో చెప్పేశారు. కాకుంటే.. ఈ ఉదంతం అనంతరం.. ఇలాంటివి భవిష్యత్తులో చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో.. చట్టాల్ని సవరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News