రాసలీలల్లో మునిగిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. ట్విస్టు ఏమంటే?

Update: 2021-07-23 03:35 GMT
తప్పు చేసినోళ్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకోవటం తప్పేం కాదు. తాజాగా తనను మోసం చేస్తున్న భర్తకు దిమ్మ తిరిగే షాకిచ్చిందో భార్య. తనను పట్టించుకోకుండా వేరే మహిళతో రాసలీలల్లో మునిగి ఉన్న వేళ.. లాడ్జిలోని అతడి రూంలోకి నేరుగా వెళ్లటమే కాదు.. అతడు సాగిస్తున్న రాసలీలల్ని వీడియో తీయటమే కాదు.. పోలీసులకు పట్టించిన తీరు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారటంతో ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంలోకి వెళితే..

జైపూర్ కు చెందిన ఒక సీఆర్ఎఫ్ జవాన్ భార్యతో కలిసి ఉంటున్నాడు. ఆమె ఒక టీచర్ గా పని చేస్తున్నారు. అయితే.. సదరు సీఆర్ఎఫ్ జవానుకు ఒక మహిళతో అక్రమ సంబంధం ఉంది. తన ఫోన్ లో అదే పనిగా మాట్లాడుతూ ఉండటం.. తనకు ఆ విషయాలు ఏమీ చెప్పక పోవటం లాంటి వాటితో సదరు భార్యకు భర్త మీద అనుమానం వచ్చింది. దీంతో క్రాస్ చెక్ చేసుకున్న ఆమెకు.. భర్తకు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని భావించింది. అదే సమయంలో ఫోన్ లో తన భర్త సదరు మహిళను ఒక లాడ్జిలో కలవబోతున్నాడన్న విషయాన్నిగుర్తించింది.

భర్త బయటకు వెళ్లినంతనే భార్య కూడా అతడ్ని ఫాలో చేసింది. భర్త వెళ్లిన లాడ్జిని గుర్తించి.. అందులో సదరు మహిళతో ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకుంది. లాడ్జి నిర్వాహకులతో మాట్లాడిన ఆయన.. తన పరివారాన్ని వెంట పెట్టుకొని.. పోలీసుల్ని కూడా కలుపుకొని సెకండ్ కీతో లాడ్జి రూంలోకి ఎంటరైంది. పోలీసులు తాళం తీసి చూసే సరికి.. భర్త.. అతడి ప్రేయసి రాసలీలల్లో మునిగి ఉన్నారు. ఈ ఉదంతాన్ని ఆమె వీడియో షూట్ చేసింది. వారు హోటల్ గదిలోకి వెళ్లేసరికి ఇరువురు నగ్నంగా ఉండటం.. ఆ సీన్లను వీడియో తీయటమే కాదు.. నెట్టింట్ పెట్టేసింది. అనంతరం పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

ఈ వీడియో వైరల్ గా మారింది. పెను సంచలనం కావటం.. సదరు మహిళకు తీవ్ర ఇబ్బందిని కలిగించింది. ఒక వ్యక్తితో తాను లివింగ్ రిలేషన్ లో ఉన్నానని.. దాన్ని వీడియో తీసి.. తన ప్రియుడి భార్య వేధింపులకు దిగుతోందని.. తననను వేధిస్తున్నారంటూ రివర్సు గేరులోకి వెళ్లారు ఆ మహిళ. తనకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు బయటకు రావటంతో.. తన కుటుంబ సభ్యులు.. బంధువుల వద్ద పరువు పోయిందని సదరు మహిళ పోలీసుల్ని ఆశ్రయించింది. సదరు వీడియోల్ని చూసి తన బంధువులు మనస్తాపానికి గురైనట్లుగా పేర్కొంది. తాజాగా సదరు మహిళ శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. తన ప్రియుడి భార్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. మరీ.. ఉదంతంలో పోలీసులు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News