ఖ‌త‌ర్నాక్ లేడీ: భ‌ర్త‌ను హ‌త్య చేసి.. ప్రియుడి ఇంట్లో పూడ్చేసింది!

Update: 2022-11-15 04:09 GMT
వివాహేత‌ర సంబంధాలే త‌ప్ప‌ని భావిస్తున్న ప్ర‌స్తుత కాలంలో ఈ త‌ప్పుల‌కు తోడు మ‌రిన్ని త‌ప్పులు చేస్తూ మ‌హిళ‌లు నేర‌స్తులుగా మారుతున్న ఘ‌ట‌న‌లు రోజుకొకటి చొప్పున వెలుగు చూస్తున్నాయి. తాజాగా త‌న ప్రియుడికి, త‌న‌కు అడ్డు వ‌స్తున్నాడ‌ని భావించిన ఓమ‌హిళ త‌న భ‌ర్తును మ‌ట్టుబెట్టింది. అనంత‌రం ఆ మృత‌దేహాన్ని  ప్రియుడి ఇంట్లోనే పూడ్చేసింది. అత్యంత విదార‌క‌మైన ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది.

ఉత్తర్ప్రదేశ్ ఘజియాబాద్ లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి ఓ మహిళ కట్టుకున్న భర్తనే హతమార్చింది. అనంతరం ప్రియుడి ఇంటిలో గొయ్యి తీసి భర్త మృతదేహాన్ని పాతిపెట్టేసింది.

ఘటనాస్థలికి వచ్చిన పోలీసులకు తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని తప్పుదోవ పట్టించింది. 2018లో జరిగిన ఈ ఘ‌ట‌న తాజాగా వెలుగు చూసింది. ఎందుకంటే.. ఆమె చెప్పిన మాట‌ల‌ను పోలీసులున‌మ్మారు. దీంతో అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత ఈ కేసును గాజియాబాద్ క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. వారు ఈ కేసును ఛేదించారు.

మృతుడు చంద్ర వీర్ సింగ్ 2018 ఆగస్టు 5న హత్యకు గురయ్యాడు. తన భర్త కిడ్నాప్ అయ్యాడని బాధితుడి భార్య ఘజియాబాద్ పోలీసులకు చెప్పడం వల్ల ఈ కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఎలాంల‌టి ఆధారాలు లభించకపోవడం వల్ల గాజియాబాద్ క్రైమ్ పోలీసులకు ఈ కేసును అప్పగించారు.

మృతుడి భార్యను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తన భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి, ప్రియుడి ఇంట్లోనే గొయ్యి తీసి  పూడ్చి పెట్టినట్లు నిందితురాలు ఒప్పుకుంది.

హత్యానంతరం మృతుడి చేతికి ఉన్న బంగారు ఉంగరం తీయలేక.. అతడి చేతిని సైతం నరికేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది. బాధితుడి మృతదేహాన్ని గొయ్యిలో నుంచి వెలికితీసి.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మొత్తానికి ఈ ఘ‌ట‌న దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News