గడిచిన కొద్ది రోజులుగా ఏపీ సర్కారుకు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి మద్య నడుస్తున్నవార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆస్థిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఏపీ సర్కారు విపరీతంగా ప్రయత్నిస్తుంటే.. దాన్ని భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. ఇదిలా ఉండగా.. ఏపీ హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒకరకంగా హైకోర్టు తాజా ఆదేశాలు.. ఏపీ సర్కారుకు.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు పరీక్ష పెట్టినట్లే చెప్పాలి.
తాజాగా స్థానిక ఎన్నికల్ని నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావిస్తుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వద్దని జగన్ సర్కారు చెబుతోంది. ఇలాంటివేళ.. ఎన్నికల వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టును కోరింది ఏపీ సర్కారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు.. తాజాగా ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయాలని చెప్పింది. ప్రభుత్వ వినతిని ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని పేర్కొంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘానికి ఏపీ సర్కారు లేక రాయలేని పరిస్థితి. రెండింటి మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిని ఉన్నాయి. ఇలాంటివేళ.. ఎన్నికల కమిషనర్ కు లేఖ రాయటానికి ఏపీ సర్కారు సిద్ధమవుతుందా? అన్నది ప్రశ్నే. ఎందుకంటే.. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు వివాదం చోటు చేసుకోవటం.. దీనిపై కోర్టులకు వెళ్లటం జరిగింది. హైకోర్టు తాజా ఆదేశాలు చూస్తే.. స్థానిక ఎన్నికల్ని నిర్వహించొద్దని.. కరోనా కేసుల నేపథ్యంలో వద్దని కోరాలి. ఆ వినతిని ఏపీ ఎన్నికల కమిషన్ పరిశీలిస్తుంది.
ఏపీ ఎన్నికల కమిషనర్ ను తాము గుర్తించటం లేదన్నట్లుగా ఉన్న ఏపీ సర్కారు.. హైకోర్టు మాటకు ఎలా స్పందిస్తుందన్నది క్వశ్చన్. హైకోర్టు ఆదేశాలపై మరోసారి పిటిషన్ దాఖలు చేస్తుందా? రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు చేస్తుందా? వీటన్నింటికి భిన్నంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? అన్నది ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.