టీ20 వరల్డ్ కప్ సందర్భంగా భారత.. పాక్ ల మధ్య జరిగే మ్యాచ్ కు సంబంధించి మరో గందరగోళానికి తెర లేచింది. మొదట ఈ మ్యాచ్ ను ధర్మశాలలో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే.. తాము భద్రత కల్పించలేమని.. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కారు తేల్చి చెప్పటంతో వేదికను ధర్మశాల నుంచి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మ్యాచ్ ను ‘‘ఏటీఎఫ్ ఐ’’ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాక్ ఆటగాళ్లు ఈడెన్ లో క్రికెట్ ఆడితే అమరవీరులకు అవమానం అంటున్న ఈ సంస్థ జాతీయ అధ్యక్షుడు వీరేశ్ శాండిల్యా భారీ వార్నింగ్ ఇచ్చారు. ఈడెన్ లో మ్యాచ్ నిర్వహించాలని చూస్తే.. ఈడెన్ పిచ్ మొత్తాన్ని తవ్వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎయిర్ పోర్ట్ తో సహా.. కోల్ కతా మొత్తం భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో భారత్.. పాక్ మధ్య జరగాల్సిన మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి.