తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరు నెలల పాలన బాగానే సాగుతోంది. ఆయన సీఎం పదవికి కొత్త అయినా పాలనకు కాదు అని నిరూపించుకుంటున్నారు. ఇక కొత్త నిర్ణయాలతో జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. కేవలం తన రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాకుండా దేశంలోని అనేక కీలకమైన సమస్యల మీద కూడా స్టాలిన్ గట్టిగానే స్పందిస్తున్నారు. డీఎంకే పొలిటికల్ స్టాండ్ ఏంటి అన్నది ఆయన నిక్కచ్చిగా చెబుతున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసే ఆందోళనలకు డీఎంకే మద్దతు ఇస్తోంది. అలాగే మోడీ సర్కార్ కి వ్యతిరెకంగా ఏర్పాటు అవుతున్న విపక్ష కూటమిలో కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించాలి అన్న పట్టుదల అయితే స్టాలిన్ లో ఉంది. మరి తమిళనాడు సీఎం తో పోల్చితే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాజకీయ విధానాలు అంత సూటిగా ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే.
తెలంగాణా సీఎం కేసీయార్ అడపా దడపా కేంద్రం మీద విమర్శలు చేస్తూ వస్తున్నారు. టీయారెస్ సాగు చట్టాలకు వ్యతిరేకంగా స్టాండ్ తీసుకుంది. ఏపీలో అయితే రెండు సార్లు జరిగిన భారత్ బంద్ కి వైసీపీ మద్దతు ఇచ్చింది. అయితే ఇవొక్కటే కాదు, మోడీ సర్కార్ రాష్ట్రాల హక్కులను హరించే విధంగా చేస్తున్న అనేక విధానాల పట్ల అంతా గళమెత్తాలని స్టాలిన్ కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాడు నుంచి తమ ఎంపీలను నేరుగా జగన్ వద్దకు పంపించిన స్టాలిన్ కేంద్రం ఆధ్వర్యంలో నీట్ పరీక్షల మీద తన అభ్యంతరాలను తెలియచేశారు. నీట్ పేరుతో నిర్వహిస్తున్న పరీక్షలు రాష్ట్రాల హక్కులను కాలదన్నడమే అని కూడా అంటున్నారు.
కేంద్రం ఒక్కోక్కటిగా గుంజుకుంటున్న అధికారాల మీద రాష్ట్రాలు అన్నీ కలసి పోరాడాలని కూడా స్టాలిన్ గట్టిగా కోరుకుంటున్నారు. ఆయన ఈ మేరకు ఇప్పటికే పదకొండు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. అయితే జగన్ వద్దకు తాజాగా తన ఎంపీలను స్వయంగా పంపడం వెనక రాజకీయ వ్యూహం ఉందని అంటున్నారు. జగన్ని తన వైపునకు తిప్పుకోవడం ద్వారా సౌత్ నుంచి మోడీకి ఎర్ర జెండా చూపించాలని స్టాలిన్ భావిస్తున్నారు అంటున్నారు. జగన్ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ నాడు అటెండ్ అయ్యారు. ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.
అదే టైమ్ లో తమిళనాడు ఎన్నికల్లో స్టాలిన్ గెలవాలని జగన్ కూడా కోరుకున్నారు. మరి ఇపుడు కేంద్రం మీద ప్రత్యేకించి మోడీ మీద దండెత్తుతున్న స్టాలిన్ కి జగన్ అండగా ఉంటారా, ఇద్దరూ చేతులు కలుపుతారా అన్నది చర్చగా ఉంది. జగన్ అయితే కేంద్రానికి ఎంత మద్దతు ఇచ్చినా వారి నుంచి అంతంతమాత్రంగానే సహకారం ఉంది అని భావిస్తున్నారు. పైగా ఏపీలో చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్యనే పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాంతో బీజేపీ మీద మోడీ మీద పోరాడడానికి జగన్ సిద్ధంగా ఉంటారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తానికి జగన్ కనుక స్టాలిన్ తో చేతులు కలిపితే సౌత్ రాజకీయాలు వేరే లెవెల్ లో ఉంటాయని చెప్పాల్సిన పని లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.