ముందు మన ఇంటిని సర్దుకొని.. తర్వాత పక్కింటి మీద ఫోకస్ పెట్టే రోజులు పాతవైపోయాయి. ఇంట్లో ఎలుకల మోత ఎంత ఉన్నా.. ఆ సంగతిని పట్టించుకోకుండా పక్కింటి మీదనే ఫోకస్ పెట్టే పాడు రోజులు ఏపీ అధికారపక్షంలో అంతకంతకూ పెరుగుతోంది. ఎంతసేపటికి తమ రాజకీయ ప్రత్యర్థులను ఏ రీతిలో ఇరుకున పెట్టాలి? ఎంతలా ఇబ్బందులకు గురి చేయాలన్న ఆలోచన చేసే ముఖ్యమంత్రి.. దానికంటే ముందు తన పార్టీకి చెందిన అసమ్మతి గళాల్ని తగ్గించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న మాట వినిపిస్తోంది.
ఇదే సమయంలో అధికార పార్టీకి అండగా నిలిచిన రాయలసీమలోని నాలుగుజిల్లాల్లో అధికారపార్టీ నేతల మధ్య రచ్చ అంతకంతకూ ముదిరిపోతోంది. వీరి మధ్య దూరం తగ్గించే విషయంలో సీఎం జగన్ ఏమీ చేయలేకపోతున్నారన్న విమర్శ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు తెచ్చి పెట్టిన జిల్లాల్లో అసమ్మతి పోరు అంతకంతకూ ఎక్కువ కావటమే కాదు.. తమ మధ్య ఉన్న విబేధాల్ని బాహాటంగా చూపించుకోవటానికి సైతం వెనుకాడని తీరు కనిపిస్తోంది.
మొదటినుంచి సొంతిల్లును చక్కదిద్దుకునే విషయం మీద పెద్దగా ఆసక్తి చూపించని ముఖ్యమంత్రి జగన్ తీరు కారణంగా.. గొడవలు అంతకంతకూ ముదిరిపోయి.. బాహాటంగా బయటకు వచ్చి మాటల్లోనూ.. చేతల్లోనూ చూపించే వరకు విషయాలు వెళుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికైనా సీఎం పట్టించుకోకపోతే సొంతోళ్లే దెబ్బేసే రోజులు దగ్గరకు వచ్చినట్లే అన్న మాట వినిపిస్తోంది.
ఎక్కడిదాకానో ఎందుకు? వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతల్లో ముందువరుసలో నిలిచే మంత్రి ఆర్కే రోజా సంగతే చూద్దాం. నోరు తెరిస్తే చంద్రబాబు నాయుడు.. పవన్ కల్యాణ్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆమెకు.. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల కారణంగా ఎదురయ్యే అవమానాలు ఎంత ఎక్కువన్న విషయం తరచూ చోటు చేసుకునే పరిణామాలే నిదర్శనంగా చెప్పొచ్చు. నియోజకవర్గంలో అసమ్మతిని పెంచి పోషించే పెద్దల మీద చర్యలు కోసం ఆమె కోరని రోజు లేదు. నిజానికి జగన్ కూర్చొని సంగతి తేల్చాలనుకుంటే తేల్చే అవకాశం మొదట్లో ఉండేది. ఇప్పుడు పరిస్థితులు ముదిరిపోయిన నేపథ్యంలో.. ఆయన స్వయంగా రంగంలోకి దిగినా నేతల మధ్య పెరిగి దూరం తగ్గే చాన్సే లేదంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న నేతలు చాలామందే ఉన్నట్లుగా చెప్పాలి. కర్నూలు జిల్లా విషయానికి వస్తే ఎమ్మిగనూరు.. మంత్రాలయంలో ఇలాంటి పరిస్థితే ఉంది. కర్నూలు, నందికొట్కూరులో నేతల మధ్య పంచాయితీ ఎంతన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్.. శాప్ ఛైరర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల మధ్య వైరం ఒక పట్టాన తెగకపోవటమే కాదు.. చివరకు సీఎం స్వయంగా పంచాయితీ చేసినా వీరిద్దరూ తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు పార్టీకి శాపంగా మారిందంటున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆలూరులోనూ ఇలాంటి పరిస్థితే ఉంది.
ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే.. రాప్తాడు, పెనుకొండ, కదిరి, ఉరవకొండ, మడకశిర, హిందూపురం నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య దూరం అంతకంతకూ పెరగటమే కాదు.. బాహాటంగా తిట్టేసుకొంటున్న దుస్థితి. ఉమ్మడి చిత్తూరు జల్లా విషయానికి వస్తే మదనపల్లి.. నగరి తదితర నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య వైరం అంతకంతకూ ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. సీఎం జగన్ సొంత జిల్లా అయిన ఉమ్మడి కడపలోనూ ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.. ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ ల మధ్య వర్గ పోరు ముదిరిపోయింది. ఈ ఇద్దరు నేతల మధ్య పెరిగి విభేదాలు చివరకు ఎక్కడి వరకు వెళ్లాయంటే.. ఎమ్మెల్సీ రమేశ్ ఇటీవల మాట్లాడుతూ.. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పటం గమనార్హం.
జమ్మలమడుగు.. తంబళ్ల పల్లి.. రాజంపేట నియోజకవర్గాల్లోనే ఇలాంటి పరిస్థితే ఉందంటున్నారు. ఇలా రాయలసీమలోని చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పెరిగిన దూరం పార్టీకి శాపంగా మారుతుందంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సొంతిల్లు సర్దుకోవటం.. సొంత బలాన్ని మరింత పెంచుకోవటం మీద కంటే.. ప్రత్యర్థుల్ని బలహీనపర్చటం.. వారి మీద సామ దాన దండోపాయాల్ని ప్రయోగించటం మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా సీఎం జగన్ కళ్లు తెరవాల్సి ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. ఈ రచ్చ రీసౌండింగ్ ను తగ్గించే పనిని సీఎం జగన్ ఎప్పుడు చేపడతారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.