ఒడిషా తో ఏపీకి సరిహద్దు వివాదాలు ఈ నాటివి కావు. అసలు ఒడిషా రాష్ట్రం లోనే శ్రీకాకుళం జిల్లా కూడా ఒకపుడు ఉండేది. అంటే 1936 దాకా ఒడిషా లోనే అది భాగం. ఆ తరువాత ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లో కలిసింది. ఇక 1950 ప్రాంతంలో విశాఖ నుంచి నుంచి వేరు పడి కొత్త జిల్లా గా ఆవిర్భవించింది. అంటే ఇపుడు ఏపీ లో ఉన్న శ్రీకాకుళం ఒక నాడు ఒడిషా లోనే ఉండేది అని అర్ధం చేసుకోవాలి. ఆ విధంగా సరిహద్దు సమస్యలు వివాదాలు చాలా దశాబ్దాలుగా వస్తున్నాయి. వాటి మీద ఏపీ పాలకులు ఏనాడూ పెద్దగా శ్రద్ధ చూపించలేదు, అదే సమయం లో ఒడిషా లో ఎవరు అధికారం లో ఉన్న కేంద్రం తో గట్టి లాబీయింగ్ చేసుకుంటూ తమ రాష్ట్ర ప్రయోజనాలను ఎప్పటికపుడు కాపాడుకుంటూ వస్తున్నారు.
ఇపుడు ఒడిషా తో ఏపీ సీఎం జగన్ చర్చలు ఎంత వరకూ ఫలిస్తాయి అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉంది. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తమ రాష్ట్ర ప్రయోజనాల కు పెద్ద పీట వేస్తారు. ఆ విషయం లో ఆయన రెండవ మాట వినరు. ఇక నేరేడి బ్యారేజిని వంశధార మీద కడితే ఏపీ కి రెండున్నర లక్షల ఎకరాల సాగు నీరు అందుతుంది. అలాగే ఒడిషా కు కూడా యాభై వేల ఎకరాలా దాకా సాగు నీరు దక్కుతుంది. మరి నేరేడి బ్యారేజి ఒక విధంగా ఉభయ కుశలోపరి గానే చూడాలి. కానీ 2017 లో ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాలకు అనుకూలం గా తీర్పు ఇస్తే దాని మీద ఒడిషా సుప్రీం కోర్టు కు వెళ్లింది. ఇపుడు అది అలా ఉండగా ఏపీ కి ఒడిషా అనుకూలం గా స్పందిస్తుందా అన్నది పెద్ద డౌట్.
అలాగే విజయనగరం జిల్లా లో ఉన్న 21 కొటియా గ్రామం లో మెజారిటీ అంటే 17 దాకా ఏపీ లోనే ఉంటామని అంటున్నాయి. అయితే ఈ గిరిజన గ్రామాల్లో బంగారం, బాక్సైట్ సహా ఇతర గనులు ఉన్నాయని అంటున్నారు. ఆ నిక్షేపాల కోసమే ఆ గ్రామాలను వదులు కోవడానికి ఒడిషా అసలు ఒప్పుకోవడం లేదు. మరి ఈ విషయం లో ఒడిషా ససేమిరా అని అంటోంది. చర్చల ద్వారా కూడా ఇది పరిష్కారం అవుతుందా అన్నది సందేహమే విజయనగరం జిల్లా లోని జంజావతి డ్యామ్ విస్తరణకు ఒడిషా ప్రతీ సారీ అడ్డు పెడుతోంది. దాని వల్ల వేయి దాకా ఎకరాలు నీట మునుగుతాయని చెబుతోంది. అలాగే ముల్కాన్ గిరి వద్ద కొన్ని గ్రామాలు పోలవరం ప్రాజెక్ట్ ద్వారా నీట మునుగు తాయని ఒడిషా అడ్డుకుంటోంది. ఇలా అన్ని విధాలు గా చూస్తే ఒడిషా తన పంతం మీద నే తాను ఉంది. ఏది ఏమైనా ఏపీ నుంచి మంచి అడుగు పడుతోంది. చర్చలు ఎపుడూ అభినందనీయమే. దాంతో పాటు పట్టు మీద ఉన్న ఒడిషా ను విడుపు దారికి తెస్తే కనుక జగన్ చరిత్ర లో నిలిచి పోతారు.