దేశ ప్రధాని మొదలు సామాన్యుడి వరకూ.. ఆ మాటకు వస్తే యావత్ ప్రపంచాన్ని వణికించిన మాయదారి రోగానికి చెక్ చెబుతూ వ్యాక్సిన్ వచ్చేసే రోజు దగ్గరకు వచ్చినట్లుగా చెబుతున్నారు. కొందరి నిపుణుల అంచనా ప్రకారం వచ్చే ఏడాది మార్చి నాటికి కానీ వ్యాక్సిన్ రాదని.. అప్పటివరకూ ఈ మహమ్మారితో సహజీవనం చేయక తప్పదని చెబుతున్నా.. అందుకు భిన్నంగా కొత్త మాట వినిపిస్తోంది.
ఫార్మా కంపెనీలు చెబుతున్న దాని ప్రకారం మరో నాలుగు వారాల్లో మహమ్మారికి చెక్ పెట్టే వ్యాక్సిన్ ఒకటి అందుబాటులోకి రావటం ఖాయమని చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థ మహమ్మారికి చికిత్స కోసం ఫావిపిరావిర్.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ లు ఉపయోగపడతాయని చెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫార్మా కంపెనీలు సిప్లా.. గ్లెన్ మార్క్ లు క్లినికల్ ట్రయల్స్ షురూ చేశాయి.
ఇప్పటివరకూ చేసిన ప్రయోగాల ప్రకారం ఈ మందులతో వంద మంది రోగుల్లో 60-70శాతం మందికి పరిస్థితి మెరుగైందని చెబుతున్నారు. మిగిలిన వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ భారీగా కనిపించలేదన్న మాట వినిపిస్తోంది. తీవ్ర లక్షణాలు ఉన్న వారికి రెమిడెస్ విర్ వాడటం మంచిదేనని చెబుతున్నారు. ఫావిపిరావిర్ వాడటం ద్వారా జపాన్ లో దాదాపు 70 వేల మంది రోగులకు సాంత్వన లభించిందని చెబుతున్నారు.
భారత్ లో ఫావిపిరావిర్ తో పాటు రెమిడెస్ విర్ ను మందుగా వినియోగించి సత్ఫలితాలు సాధించినట్లుగా చెబుతున్నారు. నిజానికి ఈ రెండు మందుల్ని భారతీయులకు ఇప్పటివరకూ వాడని నేపథ్యంలో.. ఆచితూచి వినియోగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విస్తరిస్తున్న ఈ మహమ్మారికి చెక్ పెట్టేందుకు వీలుగా ఈ రెండు మందుల్ని వినియోగించటం ద్వారా మరిన్ని సానుకూల ఫలితాలు పొందొచ్చన్న ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లుగా సాగితే.. మరో రెండు నెలల్లో ఈ మందులకు అనుమతులు లభిస్తాయని చెబుతున్నారు.
అదే జరిగితే.. ఈ మందుల్ని విడుదల చేసేందుకు ఫార్మా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అయితే.. ఈ మందుల్ని తయారు చేసిన రెండు కంపెనీల కాంబినేషన్ ఒకేలా ఉన్నాయా? వేర్వేరుగా ఉన్నాయా? అన్న విషయంపై పరీక్షలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఈ మందుల్ని అనుకున్నట్లుగా అందుబాటులోకి వచ్చి.. సత్ఫలితాలు రావటం మొదలైతే మాత్రం యావత్ ప్రపంచానికి పండుగగా మారుతుందని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.