అస్సలు ఫీల్ కావొద్దు.. తాళి తీసి ముఖాన కొట్టేయ్..

Update: 2020-02-06 17:30 GMT
అమానుష ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. మగాడిలోని పశువు నిద్ర లేచినప్పుడు ఎలాంటి దారుణాలు చోటు చేసుకుంటాయో..తాజాగా అలాంటి ఉదంతమే హసన్ జిల్లాలో చోటు చేసుకుంది. మరదలు వరుస అయ్యే అమ్మాయి బస్టాప్ లో వెయిట్ చేస్తుంటే.. బలవంతంగా లాక్కెళ్లి పెళ్లి చేసుకున్న వైనం సంచలనంగా మారింది.

తనను పెళ్లి చేసుకొమ్మని అడిగితే.. అందుకు నో చెబుతుందన్న కోపంతో బస్సు కోసం ఎదురుచూస్తున్న ఆమెను బలవంతంగా కారులో లాక్కెళ్లిపోయారు. తనను వదిలిపెట్టాలని సదరుయువతి ఎంత బ్రతిమిలాడినా వినకుండా తాళి కట్టాడు. దీంతో.. ఆ మహిళ కుప్పకూలిపోయింది. ఈ దారుణానికి ఇద్దరు యువకులు సహకరించినట్లుగా చెబుతున్నారు.

జరిగిన దారుణంపై బాధితురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. బలవంతంగా తాళి కట్టిన యువతిని తన స్నేహితుడి వద్ద దాచిపెట్టినట్లుగా చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిగిన ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇష్టం లేకుండా.. పశుబలంతో బలవంతంగా తాళి కడితే.. తెంచి వాడి ముఖాన పడేయాల్సిందే. అంతేకానీ.. బాధ పడాల్సిన అవసరం బాధితురాలికి లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News