టీడీపీ పాల‌న‌లో కిలాడీ లేడీలు.. నిలువునా దోచేశారుగా..!

Update: 2019-10-21 13:34 GMT
గ‌డిచిన టీడీపీ పాల‌న‌లో ఎమ్మెల్యేలు దోచుకున్నారు. త‌మ్ముళ్లు చెల‌రేగిపోయారు.. ప్ర‌జ‌ల‌ను నానా ఇబ్బందుల‌కు గురి చేశారు. నిట్ట‌నిలువునా దోచుకున్నారు. అనే వార్త‌లు మ‌నం విన్నాం. అయితే, తాజాగా ఇదే టీడీపీ పాల‌న‌లో కిలాడీ లేడీలు కూడా చెల‌రేగిపోయార‌ని తాజాగా తెర‌మీదికి వ‌స్తున్న వార్త‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. చంద్ర‌బాబు పాల‌న‌లో అంతా పార‌ద‌ర్శ‌కంగానే జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పుకొంటున్నా.. తాజాగా తెర‌మీదికి వ‌స్తున్న విష‌యాల‌ను గ‌మ‌నిస్తే.. మాత్రం ఇంత దారుణంగా ఉందా? అని అనిపించ‌క‌మాన‌దు. రాజ‌ధానిగా గుంటూరు జిల్లాను ప్ర‌క‌టించిన త‌ర్వాత ఈజిల్లాలో చాలా అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని - అమాయ‌కులే ల‌క్ష్యంగా దోచుకున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

వీటి వెనుక ప్ర‌జాప్ర‌తినిధుల హ‌స్తం ఉంద‌ని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.అయితే, ఇలాంటి ఆరోప‌ణ‌లు రావ‌డం టీడీపీ నేత‌లు ఖండించ‌డం తెలిసిందే. కానీ, తాజాగా వెలుగు చూసిన రెండు ఘ‌ట‌న‌లు మాత్రం కాద‌న్నా.. టీడీపీ మంత్రుల బాగోతాల‌ను బ‌ట్ట‌బ‌య‌లు చేస్తున్నాయి. కిలాడీ లేడీల‌తో అత్యంత స‌న్నిహిత సంబంధాలు పెట్టుకున్న మంత్రి పుంగ‌వులు.. వారికి అన్ని విధాలా స‌హ‌క‌రించేశారు. దీంతో ఆ ఇద్ద‌రు లేడీలు రెచ్చిపోయి.. ప్ర‌జ‌ల‌ను.. ప్ర‌భుత్వ సొమ్మును కూడా దోచేశారు. విష‌యంలోకి వెళ్తే.. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకొని ఘరానా మోసాలకు పాల్పడిన మామిళ్ళపల్లి దీప్తి అనే ఘ‌రానా కిలాడీ లేడీ ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది.

సీఎంవోలో పీఏగా పని చేస్తున్నానంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని, సివిల్‌ వివాదాలు పరిష్కరిస్తానని చెప్పి అమాయకుల నుంచి రూ.70 లక్షలకు పైగా దోచుకొని బాధితుల ఫిర్యాదుతో పరారైన విషయం తెలిసిందే.  అంతేకాదు, గుంటూరు కార్పొరేషన్‌లో ఆనందలహరి కార్యక్రమం నిర్వహించేందుకు టీడీపీ హయాంలో  మంత్రి సాయంతో కాంట్రాక్ట్‌ను కొట్టేసి, ప్ర‌భుత్వ సొమ్మును భోంచేసేసింది. 2017లో అప్పటికే దీప్తికి మాజీ మంత్రితో సన్నిహిత సంబంధం ఏర్పడింది. దానిని అడ్డుగా పెట్టుకొని గుంటూరు కార్పొరేషన్‌ అధికారులకు తరచూ ఫోన్‌ చేయించి వారిని దారికి తెచ్చుకుంది. ఈ క్రమంలో గుంటూరులో ప్రతి ఆదివారం ఆనందలహరి పేరుతో కార్యక్రమం నిర్వహించేందుకు కార్పొరేషన్‌ దరఖాస్తులు ఆహ్వానించింది.

దీంతో దీప్తి తన స్వచ్ఛంద సంస్థకు అర్హత లేకపోయినప్పటికీ కాంట్రాక్టును ద‌క్కించుకుంది.  ప్రతి వారం కార్యక్రమం నిర్వహణకు కార్పొరేషన్‌ రూ.60 వేల చొప్పున చెల్లిస్తుంది. నిబంధనల ప్రకారం కార్యక్రమం కొనసాగించకుండా రూ.20 వేలలోపు ఖర్చుతో మమ అనిపించింది. దీంతో వారానికి 40 వేల చొప్పున ఏళ్ల‌కు ఏళ్ల‌పాటు దోచేసింది. ఇదిలావుంటే, మ‌రో బాగోతం కూడా ఇదే జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలిలోని ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా పని చేసిన కిలాడీ లేడీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించింది.

మాజీ హోంమంత్రి చినరాజప్పతో తనకు పరిచయాలు ఉన్నాయని పలువురిని నమ్మించింది. సేల్స్‌ మేనేజర్‌గా పని చేసిన సమయంలో తనతో పని చేసిన సహ ఉద్వోగులకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్వోగాలు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ప్ర‌భుత్వం మార‌డంలో ఇద్ద‌రు లేడీల బాగోతంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ వ్య‌వ‌హారంలో మాజీ మంత్రుల పాత్ర ఉంటే ఖ‌చ్చితంగా కేసులు కూడా న‌మోద‌వుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా.. టీడీపీ హ‌యాంలో త‌మ్ముళ్లే కాదు.. త‌మ్ముళ్ల వీక్‌నెస్‌ను అడ్డు పెట్టుకుని కూడా ప్ర‌జ‌ల‌ను దోచేసిన కిలాడీ లేడీలున్నార‌నే విష‌యం బ‌య‌ట‌కు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.


Tags:    

Similar News