నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ పరుగులతో కూడిన ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భారీ బ్రేకులు వేసేసింది. అంతే.. ప్రపంచం ఇప్పుడు స్తంభించిపోయిన పరిస్థితి. దేశాలకు దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోవటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి. వారాలకు వారాలు సాగుతున్న లాక్ డౌన్ తో సిత్రవిచిత్రమైన ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. తాజా ఉదంతం కూడా ఈ కోవకే చెందినదే. అమ్లెట్ కోసం ఇంట్లో జరిగిన చిన్న గొడవకు మనస్తాపానికి గురైన 23 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది.
కాల్వ శ్రీరాం మండలంలోని మీర్జంపేట గ్రామానికి చెందిన 23 ఏళ్ల దివ్య భవాని ఇంటి దగ్గరే ఉంటోంది. స్కూల్ సెలవుల కోసం వచ్చిన ఆమె అక్క కొడుకు వారింట్లోనే ఉంటున్నాడు. తాజాగా భోజనాల సమయంలో దివ్య ప్లేట్ లోని అమ్లెట్ ను లాగేసుకొని తినసాగాడు. అతగాడి తీరును దివ్య భవాని తప్పు పట్టింది. ఈ సందర్భంగా మాటా.. మాటా అనుకున్నారు.
మధ్యలో ఎంట్రీ ఇచ్చిన దివ్య భవాని తండ్రి.. కుమార్తె తీరును తప్పు పట్టారు. అమ్లెట్ తీసుకుంటే అలా తిట్టేయాలా? అని క్లాస్ పీకారు దివ్య తండ్రి. దీంతో మనస్తాపానికి గురైన దివ్య భవాని ఇంట్లోని గదిలోకి వెళ్లి తలుపులేసుకుంది. ఆ వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించిన ఇంట్లోని వారు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మాయదారి అమ్లెట్ కోసం గొడవ ఒక నిండు ప్రాణం బలి కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చిన్న గొడవలకే ఇంతలా రియాక్ట్ అవుతారా? అని ముక్కున వేలేసుకుంటున్నారు.