మగాళ్లతో సమానంగా మహిళలు దూసుకుపోతున్న రోజులవి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతూ, సమానంగా విజయాలు సాధిస్తున్నారు. ఇన్నాళ్లూ ఆ విషయంలో కాస్త వెనకబడ్డారేమో అనుకున్నాం! కానీ, ఇప్పుడా లోటు కూడా తీరిపోయింది! అదేనండీ... తాగుడు విషయంలో! మద్యం సేవించడం అంటే అందరికీ మగాళ్లే గుర్తొస్తారు. పూటపూటకీ పూటుగా తాగేది మగాళ్లే అనే ముద్ర ఎప్పట్నుంచో పడిపోయింది! ఏం చేస్తాం... గతం అలానే ఉంది లెండి! అయితే, ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేందుకు ఆడోళ్లు కూడా బాగానే తాగుతున్నారంటూ తాజాగా ఒక అధ్యయనంలో తేలింది.
మహిళలు- మద్యపానం అనే విషయమై దాదాపు ఐదేళ్లపాటు అధ్యయనం చేసింది ఆస్ట్రేలియాకు చెందిన న్యూసౌత్ వెల్స్ యూనివర్శిటీ. ఈ అధ్యయనంలో తేలింది ఏంటంటే... ప్రపంచవ్యాప్తంగా పురుషులకు సమానంగా మహిళలు కూడా మద్యం సేవిస్తున్నారని! ఈ విషయంలో మగాళ్లు - మగువల మధ్య ఒకప్పుడు 12 రెట్లు తేడా ఉండేదట! కానీ, ఇప్పుడా తేడా చాలా తగ్గిపోయిందని రీసెర్చ్ రిపోర్ట్ చెబుతోంది. అమెరికాలో అయితే ఆడోళ్లలో ఓ 60 శాతం మంది ఏడాదిలో ఒక్కసారైనా ఒక పెగ్ సిప్ చేస్తున్నారట!
ఇతర దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మద్యానికి అలవాటు పడుతున్న స్త్రీల సంఖ్య కాస్త తక్కువే. అయితే, నగరాల్లో మాత్రం తాగేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు ఈ నివేదికలో వెల్లడైంది. ఏడాదిలో కనీసం ఒకసారైనా మద్యం తాగాలి అనుకునే మహిళలు మన దగ్గర 5 శాతం మంది ఉన్నట్టు తేలింది. వీరి వల్ల ఏకంగా 30 శాతం మద్యం అమ్మకాలు ప్రతీయేటా పెరుగుతున్నాయి.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం - క్యాన్సర్ కారకం అని ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రకటనలు ఇస్తూ అవేర్నెస్ పెంచే ప్రయత్నం చేస్తోంది. కానీ, ఉద్యోగ జీవితంలో ఒత్తిడి - సంసారంలో ఇబ్బందులు - ఆర్థిక సమస్యలు - భార్యా భర్తల మధ్య అవగాహనా రాహిత్యం.. ఇలాంటి కారణాల వల్లనే మన నగరాల్లో మహిళలు మద్యానికి బానిస అవుతున్నారు. పాశ్చాత్య దేశాల్లో మహిళలను టార్గెట్ చేసుకుంటూ కొన్ని లిక్కర్ కంపెనీలు యాడ్స్ ఇవ్వడం వల్ల కూడా వనితల్లో ధోరణి పెరిగిందని నిపుణులు అంటున్నారు. మద్యం తాగడాన్ని ఒక ఫ్యాషన్‌గానో స్టేటస్ సింబల్‌గానో మారుతన్న నేటి ధోరణిపై వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/