గండ్ర ఆ అమ్మాయిని వాడుకుని వదిలేశారట!

Update: 2018-08-05 09:27 GMT
కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ విప్ - భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  నాలుగేళ్లుగా తనను శారీరకంగా వాడుకొని ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది  గండ్ర వెంకటరమణారెడ్డిపై ఆరోపణలు చేసిన ఆమె పేరు విజయలక్ష్మి. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
   
గండ్ర భూపాలపల్లి ఎమ్మెల్యేగా - చీఫ్ విప్ గా ఉన్నప్పుడు ఆయనతో పరిచయం అయిందని... అది శారీరక సంబంధానికి దారి తీసిందని - నాలుగు సంవత్సరాలుగా మేము కాపురం చేస్తున్నామని ఆమె ఆరోపిస్తున్నారు. గండ్రకు చెందిన ఫంక్షన్ హాల్ లో - అతని ఇంట్లో అనేక సార్లు కలిసినట్లు చెబుతున్నారు. అయితే... ఇప్పుడాయన తనను పట్టించుకోవడం లేదని... తనపై పత్రికల్లో తనపై తప్పుడు కథనాలు రాయించి  బతుకును నాశనం చేశాడని ఆరోపించారు. ఇదేంటని ప్రశ్నిస్తే  తన మనుషులతో ఇంట్లో నుంచి బయటకు గెంటి వేయించారని... సుబేధారి పోలీసు స్టేషన్ లో తనపై న్యూసెన్స్ కేసు పెట్టించి నన్ను అరెస్టు చేయించారని ఆమె ఆరోపించారు.
   
‘‘గండ్ర పెద్ద మోసగాడు. నా దగ్గర ఆధారంగా ఉన్న రెండు సెల్ ఫోన్లు పోలీసులు లాక్కున్నారు. తప్పు చేసిన అతన్ని వదిలి నన్ను దోషిగా పోలీసులు చిత్రీకరించారు. సమాజంలో పలుకుబడి ఉన్న నేతలతో ఎందుకు పెట్టుకుంటున్నావని పోలీసులు తనపై ఎదురు దాడికి దిగారు. గండ్ర నాకు చేసిన అన్యాయానికి సంబంధించిన ఆధారాలన్ని సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఆధారాలన్ని పోలీసుల చేతిలో ఉన్నాయని తనకు ఎలాగైనా న్యాయం చేయండి” అంటూ బాధితురాలు విజయలక్ష్మీ వాపోయింది. విజయలక్ష్మీ ఫిర్యాదు మొదట స్వీకరించని పోలీసులు.. ఆ తరువాత ఆమె మీడియాలోకి రావడంతో లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News