ఆ ఒక్క రోజు పంపలో మహిళలకు నో
శబరిమల పంపా నదిలో మహిళల్ని స్నానం చేయొద్దంటూ శబరిమల ఆలయ కమిటీ నిర్ణయించింది. రేపు (బుధవారం) అయ్యప్పస్వామి పుణ్యస్నానం ఉత్సవమైన అరట్టు కడువు సందర్భంగా మహిళలు ఆ ఒక్కరోజు స్నానం చేయొద్దని కోరుతున్నారు. వైష్టిక బ్రహ్మచారి అయిన అయ్యప్ప నదిలో పుణ్యస్నానం చేసే సమయంలో మహిళలు పాల్గొనకూడదన్నది ఎన్నో దశాబ్దాలుగా ఉన్నదంటోంది ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు.
పంపా నదిలో ఏడాది మొత్తం మహిళలకు స్నానం చేసే వీలు ఉందని.. అరట్టు కడువు రోజున మాత్రం మహిళలకు స్నానం చేసే అవకాశం లేదని తేల్చింది. ఏడాది మొత్తం స్నానం చేసే వెసులుబాటును పెట్టుకొని.. అరట్టు కడవు రోజున కూడా మహిళలు స్నానం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా ఆలయ వర్గాలు చెబుతున్నాయి. మరి.. దీనిపై మహిళా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో..?