జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘభర్ దాస్ అడ్డంగా బుక్ అయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మర్యాదల కోసం కొందరు చేసే ప్రయత్నాల్ని నిలువరించాల్సింది పోయి.. ఓకే అనేస్తే ఎన్ని ఇబ్బందులన్న విషయం ఇప్పుడాయనకు అర్థం కావటం ఖాయం. ఇంతకీ ఏం జరిగిందంటే..
గురిపూర్ణిమ సందర్భంగా గురు మహోత్సవ్ కార్యక్రమానికి సీఎం రఘుభర్ దాస్ ను ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి వెళ్లిన ఆయనకు కాస్త భిన్నంగా స్వాగతం పలికారు. ఓ పెద్ద పళ్లెంలో ఆయన కాళ్లను పెట్టమని చెప్పారు. ఆయన పంచెకాస్త ఎత్తి పట్టుకోగా.. గులాబీ రేకులతో కలిపిన నీళ్లతో ఆయన కాళ్లను కడిగారు. ఇద్దరు మహిళల చేత ఆయనకు ఈ మర్యాద చేశారు.
దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఇది వైరల్ గా మారటమే కాదు.. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ తిట్టి పోస్తున్నారు. మహిళల చేత కాళ్లు కడిగించుకోవటం ఏమిటని మహిళా సంఘాలు నిలదీస్తుంటే.. అయినా.. ఇలాంటి పాదసేవ ఏమిటంటూ సామాజిక కార్యకర్తలు.. మేధావులు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి తీరు ఏ మాత్రం సరికాదని.. ఇలాంటి చర్యల్ని అస్సలు అంగీకరించకూడదని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఈ వివాదం మీద ముఖ్యమంత్రి మాత్రం స్పందించలేదు. మర్యాదలు చేస్తున్నారు కదా.. ఎవరేం చేసినా పట్టించుకోకుంటే ఇలాంటి తిప్పలే ఎదురవుతాయి మరి.
Full View