టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మాటలు చాలా విచిత్రంగా ఉంది. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైసీపీకి ఏకపక్షంగా వచ్చాయి. దాన్ని అచ్చెన్న తట్టుకోలేకపోతున్నట్లు కనబడుతోంది. ఇపుడు వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడిందట.
ప్రజలంతా తమకే మద్దతుగా నిలబడ్డారని, ప్రభుత్వంలోని పెద్దలకు నిజంగానే ధైర్యముంటే అసెంబ్లీని రద్దు చేసుకుని మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. మధ్యంతర ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే టీడీపీని మూసేసి తాళాలు వేసేస్తానంటు అచ్చెన్న సవాలు విసరటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబునాయుడు పనైపోయిందని చెబుతున్న మంత్ర వెల్లంపల్లి రాజీనామా చేసి మళ్ళీ గెలవగలిగితే టీడీపీని మూసేస్తామంటు అచ్చెన్న చాలెంజ్ చేయటమే విచిత్రంగా ఉంది.
తాజా ఎన్నికలతో ప్రజలు తమవైపు ఉన్నారనే విషయం స్పష్టమైందట. ఓటింగ్ శాతం పెరగటం ద్వారా ప్రజల మద్దతు తమకు పెరిగిన విషయం స్పష్టమైందన్నారు. ఇప్పుడు జరిగింది అసలు ఎన్నికలే కాదన్నారు. కుప్పం ఎన్నికల్లో తాము ఓడిపోతామన్న విషయం తమకు ఎప్పుడో తెలుసన్నారు.
తమ అభ్యర్థులను భయపెట్టి, నామినేషన్లు వేయనీయకుండా, ప్రచారం కూడా చేసుకో నీయకుండా భయపెట్టి పోలీసుల మద్దతుతో ఎన్నికలను మ్యానేజ్ చేసుకోవటం కూడా ఒక గెలుపేనా అంటు అచ్చెన్న కామెంట్ చేశారు.
అచ్చెన్న మాట్లాడేటపుడు చూస్తే ఆయనలో స్పష్టంగా ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. తాను ఇన్చార్జిగా పనిచేసిన నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లకు 54 డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది.
వైసీపీ ఏకపక్ష గెలుపును వీలైనంత తక్కువగా చూపించాలని అచ్చెన్న తెగ ప్రయత్నించిన విషయం కనబడుతోంది. ఎన్నికలయ్యాక గొడవలు, దొంగ ఓట్లు చాలా సహజమైపోయింది. తాము అధికారంలో ఉన్నపుడు వైసీపీకి అవకాశం వచ్చింది. గట్టిగా వాడుకుంది. పార్టీలు పోలీసులను వాడుకోవడం తెలుగు రాష్ట్రాల్లో బాగా నార్మల్ అయిపోయింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు, అచ్చెన్న అండ్ కో ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు ఈ ఎన్నికల్లో వైసీపీకే మద్దతుగా నిలబడ్డారు. తాజా ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ చేతులెత్తేసింది.
కుప్పంలో ఓటమి తమకసలు లెక్కే కాదని ఇపుడు చెబుతున్న అచ్చెన్న మరి చంద్రబాబు, లోకేష్ ఎందుకంతగా ప్రచారం చేశారో చెప్పగలరా ? ఒకరి తర్వాత మరొకరు కుప్పంలో దాదాపు వారం రోజులు ఎందుకని పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కష్టపడనంతగా చంద్రబాబు తాజా ఎన్నికల్లో అంత కష్టపడ్డారు?