కరోనా ప్రభావం, లాక్‌డౌన్‌తో ప్రస్తుతం చాలా సేవలు ఆన్‌లైన్‌మయమయ్యాయి. ఈ క్రమంలో ఇదే పరిస్థితి మాదిరి భవిష్యత్ అంతా ఎలక్ట్రానిక్ రంగమే రాజ్యమని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారక మారావు తెలిపారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో డిజిటల్ రంగమే ప్రజలకు అండగా, ప్రస్తుతం డిజిటల్ సేవలు ప్రజలు పెద్ద సంఖ్యలో వినియోగిస్త్ఉన్నారని చెప్పారు. ఇదే ట్రెండ్ భవిష్యత్తులో కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దీనిపై దృష్టి సారించి ఎలక్ట్రానిక్ రంగానికి శరవేగంతో అభివృద్ధి చెందించేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేశారు. అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో మంగళవారం కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఆ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తెలంగాణలో ఐటీ పరిస్థితిపై కేంద్రమంత్రికి నివేదించారు.
ప్రస్తుతం సంక్షోభ సమయంలోనూ అనేక అవకాశాలను పరిశ్రమలు అందుకునే పరిస్ధితులు ఉన్నాయని, ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సహాయకారిగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జపాన్, చైనా నుంచి తమ తయారీ యూనిట్లను ఇతర దేశాలకు తరలిస్తామని పలు కంపెనీలు బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో మనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఐటీ సంబంధిత ఎలక్ట్రానిక్స్ రంగంలోని కంపెనీలను భారతదేశానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ పరిశ్రమలు వస్తే పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణలో ఉన్న రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు నిండిపోయాయని, మరో రెండు ఈఎంసీలకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు. వ్యాపార వాణిజ్యాల నిర్వహణపై వివిధ దేశాలు ఆయా దేశాల్లోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, మేధావులతో స్ట్రాటజీ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్టు భారత్‌లోనూ అలాంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తున్నాయని భవిష్యత్తులోనూ ఇదే కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ ఆధారిత అటాక్‌లను తట్టుకునేందుకు సైబర్ సెక్యూరిటీ రంగంలో మరింత అవకాశాలు ఉన్నాయని, ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్, నెట్‌వర్క్‌ల బలోపేతం దిశగా కూడా కేంద్రం చొరవ చూపించాలని, భారత్ నెట్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను వెంటనే అందించాలని కోరారు.
బయోటెక్నాలజీ, మెడికల్ డివైసెస్, ఫార్మా వంటి రంగాల్లో ఐటీ ఆధారిత అవకాశాలు, అయా రంగాల కన్వర్జెన్స్ ద్వారా అనేక నూతన అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. వాటిని అందుకునేందుకు సిద్ధం కావాల్సి ఉందని కేటీఆర్ గుర్తుచేశారు. ఈ కామర్స్ రంగానికి కూడా పెద్ద ఎత్తున సహాయం అందించాలని కోరారు. ఈ విధంగా కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ సలహాలు, సూచనలు ఇస్తూనే తెలంగాణలో ఉన్న పరిస్థితిని వివరించారు.