అంతకుముందు అడపాదడపా తప్ప తరచూ ఉండని.. ‘ఇంటి నుంచి పని (వర్క్ ఫ్రం హోం)’.. అసలు ఊహకే అందని ‘సొంతూరు నుంచి పని (వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ -డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ)’ని.. కరోనా వైరస్ మహమ్మారి సాధారణం చేసేసింది. ముందుజాగ్రత్త అయితేనేమి.. వైరస్ వ్యాప్తి అయితేనేమి.. చాలామంది ఉద్యోగులకు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ వారికి ఇంటి నుంచి పని కచ్చితమైంది.
అయితే, ఇందులో అధికంగా ఎన్ని గంటలు విధి నిర్వర్తిస్తున్నారు..? ఉద్యోగుల మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం ఏమిటి? అనే విషయాలను పక్కనపెడితే ఇంటి నుంచి పనిచేయక తప్పని పరిస్థితులు వచ్చాయి. కొవిడ్ తొలి వేవ్ నుంచి మొదలైన ఈ సంప్రదాయం.. రెండో వేవ్ తో మరింత అధికమైంది. మూడు, నాలుగు నెలల క్రితం ఉద్యోగులూ.. ఇక కార్యాలయాలకు రండి అని కొన్ని దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. కానీ, ఈ లోగా ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ రావడంతో ఆ ఆలోచనను విరమించుకున్నాయి. ఇల్లు కంటే ఊరు ఇంకా బెటర్ కదా?
సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు పనిచేసేది నగరాల్లోనే కాబట్టి.. చాలామంది ఇళ్లు కొనుక్కుని ఉంటారు. వీరంతా ఆ సొంత ఇళ్ల నుంచే పనిచేస్తుంటారు. మరోవైపు ఎక్కువ శాతం మంది గ్రామీణ నేపథ్యం వారే ఉంటారు. కాబట్టి వీరు ఇంటి నుంచి పనిచేసినా.. తమ సహజ నేపథ్యం మాత్రం కోల్పోయినట్టే. ఇలాంటి వారికి మరింత సాంత్వన కలిగించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆలోచన అదుర్స్ అనిపిస్తోంది. విశేష ఆదరణ చూరగొనడమే కాదు.. మరింత మందుకెళ్లేలా దిశానిర్దేశం చేస్తోంది.
ఆ అనుభూతే వేరు నగరాల్లో.. కిక్కిరిసిన కాంక్రీట్ జంగిల్ లో.. ఎంత ఇంటి నుంచి పనిచేసినా అది మనస్ఫూర్తిగా చేస్తున్నామనిపించదు. ముఖ్యంగా గంటల కొద్దీ పనిచేయాల్సి ఉండే సాఫ్ట్ వేర్ నిపుణులు ఇళ్లలోని నాలుగు గోడల మధ్య బందీ అయినట్లుగా భావిస్తుంటారు. అందుకే కొందరు ఇంటి నుంచి పని కంటే కార్యాలయానికి వెళ్లడమే ఉత్తమమని నమ్ముతుంటారు. అయితే, ఇంటి నుంచి పని కాకుండా ‘‘ఊరి నుంచి పని’’ చేయమంటే ఇలాంటివారంతా ఏకగ్రీవంగా ఓటేస్తారేమో? ఎందుకంటే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా సొంత ఊరంటే అందరికీ మమకారం ఉంటుంది. అలాంటి ఊరిలో మన అనుకునే నలుగురి మధ్య.. మనకు పుట్టి పెరిగినప్పటి నుంచి అలవాటైన వాతావరణంలో పనిచేయడం అంటే ఎవరికి మాత్రం ఎగిరి గంతేయాలనిపించదు?
ఏపీ సర్కారు ఆలోచన సూపర్.. దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్ ల వరకు ఇంటి నుంచి పని అంటుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకో అడుగు ముందుకేసి.. వర్క్ ఫ్రమ్ హోమ్ టౌన్ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ) అంటూ వినూత్న ఆలోచన చేసింది. దీని ఉద్దేశం.. కరోనా సమయంలో ఉద్యోగులు సొంత ఊరు నుంచి పని చేసుకొనేలా చేయడం. ఇలాంటి పథకం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. దీనికితగ్గట్టే సక్సెస్ అవుతోంది. ఒమిక్రాన్ రూపంలో కరోనా మూడో వేవ్ ప్రారంభమవడంతో కంపెనీలు తిరిగి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీలో భాగస్వామ్యం కావడానికి అనేక ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. వీరు సొంత ఊరు నుంచే పని చేసుకొనేలా డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానం కింద కో–వర్కింగ్ స్పేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. కనీసం లక్ష మంది సొంతూరులోనే పనిచేసేలా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందుకోసం ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలల్లో కో–వర్కింగ్ స్పేస్‌లను అభివృద్ధి చేయనున్నారు.
సక్సెస్ ఎంతగానంటే.. గత నెలలో పైలెట్ ప్రాజెక్టు 29 కేంద్రాల్లో 1,500 సీట్లు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు 25కి పైగా కంపెనీలు డబ్ల్యూఎఫ్‌హెచ్‌టీ విధానంపై ఆసక్తి చూపుతున్నాయి. డిమాండ్ ఏకంగా 3,000 సీట్లకు పెరిగింది. త్వరలోనే 100 కేంద్రాలను అధికారికంగా ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కనీసం లక్ష మందిని రాష్ట్రం నుంచి పనిచేయించడమే లక్ష్యంతో ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని 1,000కు పైగా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రానికి చెందిన రెండు లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్టీ సర్వేలో వెల్లడయింది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు కింద పని చేస్తున్న వారు మరింత వేగవంతమైన బ్యాండ్‌విడ్త్, సీసీ కెమెరాలు, రవాణా సౌకర్యం వంటివి కోరుతున్నారని, వీటిని పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు.