వరల్డ్ నంబర్ 1కు కరోనా

Update: 2020-06-23 16:34 GMT
కరోనా కాటుకు ఎవరూ అతీతులు కారనే విషయం తేటెతెల్లమవుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్లు ముగ్గురికి తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

భారత్ తోపాటు పొరుగున ఉన్న పాకిస్తాన్ లో కూడా కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. పాక్ లో జనం సామాజిక దూరం లాంటివి ఏవీ పాటించకపోవడంతో అందరికీ విస్తరిస్తోంది.

తాజాగా ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది.పాకిస్తాన్ క్రికెటర్లు హైదర్ అలీ, హరీష్ రవూఫ్, షాదాబాద్ లు ఈ వైరస్ బారిన పడ్డారని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే పాకిస్తాన్ డ్యాషింగ్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్ గా తేలింది. అతడు చికిత్స పొందుతున్నాడు.

తాజాగా వరల్డ్ నంబర్ 1 క్రీడాకారుడికి కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తెలుపడం గమనార్హం. టెన్నిస్ లో ఇప్పుడు కరోనా కలకలం చోటుచేసుకుంది. ఇప్పటికే టెన్నిస్ స్టార్లు గ్రిగోర్ దిమిత్రోవ్, బోర్నా కోరిచ్ లు వైరస్ బారిన పడ్డారు.

తాజాగా ప్రపంచ టెన్సిస్ లో నంబర్ 1 ర్యాంకర్ నోవాక్ జకోవిచ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు జకోవిచ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తన భార్యకు కూడా కరోనా సోకిందని.. కానీ తన పిల్లలకు మాత్రం నెగిటివ్ వచ్చినట్లు జకోవిచ్ ప్రకటించాడు.
Tags:    

Similar News