మల్లెపూల యామిని అంటే అలా కొట్టేయాలంటోంది?

Update: 2019-11-17 04:42 GMT
నా నోరు.. నా ఇష్టమన్నట్లుగా వ్యవహరించే వారు చాలామందే కనిపిస్తారు. ఎదుటోళ్లను అనేటప్పుడు వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడేయటం.. తీరా మాట్లాడిన తర్వాత.. తన మాటలు తనకే అపాదిస్తూ మొదలయ్యే ప్రచారంతో ఉక్కిరిబిక్కిరి కావటం చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. ఇలాంటి సిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు యామిని సాధినేని.. అలియాస్ మల్లెపూల యామిని.

ఆన్ లైన్లోనే కాదు.. ఆఫ్ లైన్ లోనూ మల్లెపూల యామిని అంటూ పెరిగిన పిలుపులతో మండిపడుతున్నారు యామిని. ఈ మధ్యనే బాబుగారి పార్టీకి గుడ్ బై చెప్పేసిన ఆమె.. తనను మల్లెపూల యామిని అంటూ పిలిచే వారిని పిల్లల బురద బూట్లతో కొట్టాలని కస్సుమన్నారు.

తాను పిల్లలు ఉన్నదాన్ని అని.. స్కూలుకు వెళ్లే పిల్లలున్నారని.. తనను అలా అన్న ప్రతి ఒక్కరిని బురద బూట్లను తీసుకొని వారిని కొట్టాలన్నారు. తన ప్లేస్ లో ఉన్న ఏ మహిళలున్నా.. వారి వ్యక్తిత్వాన్ని చంపేసే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరిని అలాగే చేయాలన్నారు.

తనను మల్లెపూల యామిని అనే వారికి ఆత్మ అనేది ఉంటే..ఒకసారి ఆత్మవిమర్వ చేసుకోవాలన్నారు. మల్లెపూల యామిని అన్న పేరు రావటం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. సిత్రమైన విషయం ఏమంటే.. ఈ మల్లెపూల రచ్చను మొదలు పెట్టింది యామినినే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేసే క్రమంలో మల్లెపూల ప్రస్తావన తీసుకొచ్చారు.

టీడీపీ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత రెండు..మూడు రోజులకో ప్రెస్ మీట్ పెట్టేసి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. మంట పుట్టే విమర్శలు చేసే వారు. తాట తీస్తాం.. నలిపేస్తామని పవన్ కల్యాణ్ అంటున్నారని.. ఎవరి తాట తీస్తారు? ఏం నలిపేస్తారు? అని ప్రశ్నించిన ఆమె.. మీరు కూర్చునే మల్లెపూలు తప్పించి ఇంక దేన్నీ నలపలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆమె వ్యాఖ్యలపై పెను దుమారం రేపింది. తమ అభిమాన నటుడు కమ్ నేత పవన్ ను ఉద్దేశించి యామిని చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడ్డారు. తాము అభిమానించే పవన్ ను అన్నేసి మాటలన్న యామిని.. మల్లెపూల యామిని అంటూ పిలవటం షురూ చేశారు. అది అంతకంతకూ పెరిగి.. సాధినేని యామిని కాస్తా.. మల్లెపూల యామినిగా మారిపోవటంతో ఆమె మండిపడుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పటికి తనను అంటున్న వారిని బురదతో నిండిన బూట్లతో కొట్టాలని పిలుపునిస్తున్న యామిని.. ఈ మొత్తం రచ్చకు కారణం తానేనన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తాను ఎంతమాట పడితే అంత మాట అనొచ్చు కానీ.. తనను మాత్రం ఏమీ అనకూడదన్నది రాజకీయాల్లో ఎలా నడుస్తుంది. మల్లెపూల్ని తప్పించి మరింకేమీ నలపలేరంటూ పవన్ ను అన్నప్పుడు.. ఆయనకు ఫ్యామిలీ ఉంటుందని.. ఆయనకు పిల్లలు ఉంటారని.. తన తండ్రిని ఉద్దేశించి ఒకరు ఇంత తీవ్రంగా విరుచుకుపడిన వైనాన్ని జీర్ణించుకోవటం కష్టం కదా?

తమ మాటలతో ఎదుటోళ్లు ఎలా పడినా ఫర్లేదు కానీ.. తమను మాత్రం ఏమీ అనకూడదన్న ధోరణి ఏ మాత్రం మంచిది కాదన్న విషయాన్ని ఇప్పటికైనా యామిని గుర్తిస్తే మంచిదంటున్నారు. తాను మొదలెట్టిన మల్లెపూల మాట.. చివరకు తననే తగులుకుందన్న వాస్తవాన్ని గుర్తించాలంటున్నారు.


Tags:    

Similar News