జగన్ ప్రమాణానికి టీడీపీ రెడీ.. వెళ్లే ఇద్దరు వీరే

Update: 2019-05-29 09:07 GMT
ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ నెల 30న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈమేరకు ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. జగన్ స్వయంగా ఫోన్ చేసి చంద్రబాబును తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాడు. అయితే చంద్రబాబు మాత్రం ఈ ప్రమాణ స్వీకారానికి  హాజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. అయితే చంద్రబాబు తన  తరుఫున ముగ్గురు  టీడీపీ ఎమ్మెల్యేల ప్రతినిధుల బృందాన్ని ఆయన ఇంటికి పంపడానికి డిసైడ్ చేశారు. ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.  జగన్ కు శుభాకాంక్షలు చెబుతూ టీడీపీ ముగ్గురు ఎమ్మెల్యేల బృందం   లేఖను కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇది ప్రమాణ స్వీకారానికి ముందే తెలిపాలని.. జగన్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపాలని టీడీపీ సమావేశంలో నిర్ణయించారు.

టీడీపీ శాసనసభా సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడంపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే హాజరు కావడానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. అయితే చంద్రబాబు నిర్ణయాన్ని పార్టీ నేతలు తోసిపుచ్చారని సమాచారం. రాజ్ భవన్ లాంటి చోట నిర్వహిస్తే వెళితే బాగుంటుందని.. ఇలా బహిరంగంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నందున వైసీపీ అభిమానులను తట్టుకొని అక్కడ ఉండడం మంచిది కాదన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అందుకే చంద్రబాబు వెళ్లకుండా పార్టీ తరుఫున ముగ్గురు ఎమ్మెల్యేల  ప్రతినిధుల బృందాన్ని పంపడానికి టీడీపీఎల్సీ నిర్ణయించింది.

చంద్రబాబు తరుఫున జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లకుండా జగన్ ఇంటికెళ్లి అభినందించాలని టీడీపీ నిర్ణయించింది.  టీడీపీ తరుఫున   సీనియర్ నాయకులు  ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావును పంపాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది.  వీరు జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపుతారు. జగన్ ప్రమాణస్వీకార వేదికపై కి మాత్రం వెళ్లరు. ఈ మేరకు టీడీపీ నిర్ణయించింది.

 2014లో చంద్రబాబు నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి తన ప్రమాణ స్వీకారానికి జగన్ ను రమ్మని ఆహ్వానించాడు. అయితే జగన్ హాజరు కాలేదు. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి రమ్మని మంత్రులను హైదరాబాద్ లోటస్ పాండ్ పంపినా వారిని లోపలికి కూడా జగన్ రానీయలేదు.  ఈ రెండు కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు వెళ్లడం మంచిదికాదన్న అభిప్రాయం టీడీపీ నేతల నుంచి వ్యక్తమైందని తెలిసింది.. పైగా ప్రత్యర్థులు జగన్, కేసీఆర్ ఒకేవేదికపై ఉండబోతున్నారని.. వారి వ్యాఖ్యలతో అనవసరంగా అభాసుపాలు కాకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే ముగ్గురు ఎమ్మెల్యేలను పంపాలని.. అది ఆయన ఇంటికి వెళ్లి మాత్రమే అభినందించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇక జగన్ గెలుపుపై కూడా టీడీపీ ఎల్పీలో చర్చించినట్టు తెలిసింది. ఒక్క చాన్స్ నినాదమే వైసీపీని గెలిపించిందని టీడీపీ సీనియర్ నేతలు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఆ తర్వాత విజయవాడలో టీడీపీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News