వల్లభనేని వంశీని పక్కన పెట్టేసినట్టేనా?

Update: 2020-09-11 13:30 GMT
నోటి దురుసు వల్లే జగన్ కు దగ్గర కావాల్సిన వల్లభనేని వంశీ దూరం అవుతున్నాడా? గన్నవరంలో ఇటీవల చేసిన వ్యాఖ్యలే వంశీ కొంప ముంచాయా? ఇప్పుడు వంశీని పక్కనపెట్టేయడానికి వైసీపీ అదిష్టానం రెడీ అయ్యిందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. వంశీని వైసీపీ లోంచి పక్కన పెట్టేసినట్టేనన్న ప్రచారం సాగుతోంది.

2019 ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కొనసాగింది. 151 సీట్లు, 51శాతం ఓట్లతో ఏపీలో తిరుగులేని విజయాన్ని జగన్ అందుకున్నారు. అంత జగన్ వేవ్ లోనూ టీడీపీ బీఫాం మీద ఎమ్మెల్యేగా గెలిచాడు వల్లభనేని వంశీ. జగన్ సీఎం అయిన తరువాత సంక్షేమ పథకాలతో దూసుకొని పోతున్న సందర్భంలో కృష్ణా జిల్లా మంత్రులు సీఎం జగన్ దగ్గరికి వెళ్లి వల్లభనేని వంశీ గురించి రికమండ్ చేశారట.. ‘వల్లభనేని వంశీ టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చి రాజీనామా చేస్తాను అంటున్నాడని.. మిమ్మలను కలుస్తానుఅని చెప్తున్నాడని’ జగన్ కు విన్నవించారు. దీంతో సీఎం జగన్ అనుమతించి కలిశాడు. జగన్ ను కలిసిన తర్వాత వల్లభనేని వంశీ రెచ్చిపోయాడు. చంద్రబాబును అడ్డమైన తిట్లు తిట్టి ఏపీ సీఎం జగన్ ను పొగిడి అసెంబ్లీలో నాకు సపరేట్ సీటు కావాలని చెప్పి కూర్చున్నాడు. ఇదంతా జరిగిన విషయమే..

అంతకుముందు ఎన్నికల్లో వల్లభనేని వంశీ ‘బుద్ది ఉన్న వాడు.. ఎవడైనా వైసీపీలో చేరుతాడా’ అని పెద్ద ఎత్తున జగన్ ను ఇదే నోటితో తిట్టాడు. అప్పుడు వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వంశీని ట్రోల్ చేసింది. మళ్లీ అదే వైసీపీ సోషల్ మీడియా వంశీని పొగడడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే వైసీపీ సోషల్ మీడియా అంటే జగన్ ను దేవుడితో చూస్తారు. అలాంటి జగన్ ను తిట్టిన వ్యక్తి వైసీపీలోకి వస్తే ఎలా వెల్ కం చెప్తామని వైసీపీ సోషల్ మీడియా గమ్మున ఉంటోంది.

వైసీపీ సోషల్ మీడియా కూడా సమయం కోసం చూస్తోంది. ఈ మధ్య గన్నవరం నియోజకవర్గంలో వంశీ మనషులు 10 ఏళ్ల నుంచి వైసీపీ కోసం పోరాటం చేస్తున్న వాళ్లను కొట్టారు. దీంతో వైసీపీ సోషల్ మీడియా వంశీని టార్గెట్ చేసింది. అనంతరం వంశీ ప్రెస్ మీట్ లో ‘జగన్ గాలిలో గెలిచాను’ అంటూ గర్వంగా చెప్పుకున్నాడు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా హైలెట్ చేసింది.

దీంతో అసలేం జరుగుతోందని గన్నవరం నుంచి వైసీపీ హైకమాండ్ రిపోర్ట్స్ తెప్పించుకుందంట.. దీంతో వల్లభనేని వంశీని పక్కనపెట్టే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉందని అని కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు.

మా మీద పెత్తనం చేస్తే ఊరుకోం అని వైసీపీ వాళ్లు గన్నవరంలో ఓపెన్ గానే చెబుతున్నారట.. కాబట్టి వైసీపీ హైకమాండ్ వల్లభనేని వంశీని పక్కనపెట్టినట్టే అని కూడా చెప్తున్నారు. చూద్దాం ఏమి జరిగినా వైసీపీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందో.. అడ్డదారిలో వచ్చి పెత్తనం చేస్తున్న వాళ్లకు విలువ ఇస్తారో చూడాలి అని అంటున్నారు.
Tags:    

Similar News