ప‌రిష‌త్ ఫ‌లితం.. వైసీపికి నేర్పుతున్న పాఠ‌మేంటి...?

Update: 2021-09-21 09:57 GMT
రాష్ట్రంలో జ‌రిగిన జిల్లా, మండ‌ల ప‌రిష‌త్‌.. ఎన్నిక‌ల్లో అధికార పార్టీ వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. మొత్తం 13 జిల్లా ప‌రిష‌త్ ల‌ను ద‌క్కించుకుంది. అదే స‌మ‌యంలో ఎంపీటీసీల్లోనూ పాగా వేసింది. ఇక‌, దీనిపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపారు. తన‌పై బాధ్య‌త పెరిగింద‌న్నారు. మ‌రింత‌గా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని చెప్పారు. ప్ర‌జ‌లు త‌న‌పాల‌న‌ను, తాను ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాల‌ను చూసి ముగ్ధులై.. ఈ ఫ‌లితాల‌ను ఇచ్చార‌ని చెప్పుకొచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ రాష్ట్రంలోనూ అమ‌లు కాని సంక్షేమాన్ని సైతం తాను చేస్తున్నాన‌ని.. కులం మతం రాజ‌కీయం చూడ‌కుండా.. వాటిని అమ‌లు చేస్తున్నామ‌న్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. నిజంగానే వైసీపీకి ప్ర‌జ‌లు ఇంత భారీ మెజారిటీ క‌ట్ట‌బెట్టారా ?  ఇదినిజంగానే వైసీపీ బ‌ల‌మా ?  అనేది ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీసింది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. ఒక‌టి.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించ‌డం.. రెండు.. బ‌హిష్క‌రించిన‌ప్ప‌టికీ.. టీడీపీ కొన్ని చోట్ల గెలుపు గుర్రం ఎక్క‌డం.. వంద‌ల సంఖ్య‌లోనే ఎంపీటీసీల‌ను ద‌క్కించుకోవ‌డం వంటివి ఆశ్చ‌ర్యంగాను... చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. అంతేకాదు.. జ‌న‌సేన టీడీపీ అంత‌ర్గ‌త ఒప్పందం చేసుకుని పోటీ చేసిన స్థానాల్లో ఈ రెండు పార్టీలు విజ‌యం ద‌క్కించుకున్నాయి.

మ‌రి.. ఈ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడు వ‌చ్చిన ఫ‌లితాలు.. వైసీపీకి బ‌లం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. కొంత మేర‌కు జ‌గ‌న్ ప్ర‌భావం అయితే ఉంద‌ని.. కానీ.. పూర్తిగా మాత్రం వైసీపీపై ప్ర‌జ‌లు మొగ్గు చూపిన‌ట్టు ఫ‌లితాలు స్ప‌ష్టంగా లేవ‌ని చెబుతున్నారు. టీడీపీ క‌నుక పోటీ చేసి ఉంటే.. వైసీపీకి ఇంత బ‌ల‌మైన ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌ని అంటున్నారు. ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌ని ప‌రిస్థితి ప్ర‌జ‌ల్లో నెల‌కొన్నట్టు స్ప‌స్టంగా క‌నిపించింద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన‌తో టీడీపీ పొత్తు పెట్టుకున్న చోట్ల వైసీపీ గెలుపు గుర్రం ఎక్క‌ని విష‌యాన్ని కూడా వారు ప్ర‌స్తావిస్తున్నారు.

అదేవిధంగా కీల‌క‌మైన మంగ‌ళ‌గిరిలోను... క‌డ‌ప‌లోనూ.. ప‌శ్చిమ‌, తూర్పుగోదావ‌రి జిల్లాల్లోనూ.. విజ‌య‌న‌గ‌రంలోనూ టీడీపీ దూకుడు చూపించింద‌ని.. వాస్త‌వానికి ఆ పార్టీ బహిష్క‌రించినా.. ఈ రేంజ్‌లో పుంజుకోవ‌డం.. వైసీపీకి కొన్ని పాఠాలు నేర్పుతున్న‌ట్టేన‌ని అంటున్నారు. మ‌రి పై ఫ‌లితం చూసుకుని వైసీపీ మురిసిపోతుందో.. లేక‌.. వ‌చ్చే హెచ్చ‌రిక‌ల‌ను గ‌మ‌నిస్తుందో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News