తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు గ్రామ సచివాలయంలో స్థానిక వైసీపీ నాయకుడు మహిళా ఉద్యోగినితో సన్నిహితంగా ఉండడం ఇప్పుడు సంచలనంగా సృష్టిస్తుంది. గ్రామ సచివాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న మహిళ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు సోమవారం ఒకే గదిలో ఉన్న సమయంలో గ్రామ ప్రత్యేకాధికారిణి వచ్చి వారిని బయటకు తీసుకువచ్చారు అనే వార్త క్షణాల్లో మండలం మొత్తం వ్యాప్తి చెందింది.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక వైసీపీ నాయకులు వ్యవహారం బయటకు రాకుండా అధికారులతో మంతనాలు జరిపినట్టు కొందరు అంటున్నారు. ఈ విషయమై అనపర్తి ఎంఈవో, కుతుకులూరు ప్రత్యేకాధికారిణి స్పందిస్తూ ..తాను నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా కుతుకులూరు పంచాయతీకి వెళ్లానని.. అక్కడ మహిళా ఉద్యోగిని ఒక గదిలో ఉండడం గమనించానని, ఆమెను ప్రశ్నించగా ఆరోగ్యం బాగోనందున పడుకున్నానని చెప్పిందని, కార్యాలయంలో అలా ఉండకూడదని మందలించానని వివరణ ఇచ్చారు. అయితే , మీడియా అక్కడికి చేరుకునే సమయానికి కూడా ఆ మహిళా ఉద్యోగిని అక్కడే ఉండడం కొసమెరుపు. అయితే , సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజల క్షేమం కోసం గాంధీ కోరిన గ్రామ పాలన తీసుకు వచ్చి దాని కోసం అహర్నిశలు కష్టపడుతుంటే ..ఇలాంటివారి వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది.