పాపం అవంతి శ్రీనివాసరావు అని అంటున్నారు ఆయన వర్తమాన రాజకీయ స్థితి గురించి ఎరిగిన వారు. 2009 నుంచి 2019 వరకూ తిరుగులేని రాజకీయ హవా చాటిన అవంతికి 2024 సార్వత్రిక ఎన్నికలు టఫ్ గా మారుతున్నాయి. ఆయనను సొంత పార్టీ వారే వద్దు అంటున్నారు. ఇక అధినాయకత్వం మూడేళ్ల పాటు మంత్రిగా కొనసాగించి ఆ మీదట తప్పించింది. మొదట్లో ఆయనను విశాఖ వైసీపీ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇపుడు ఆ పదవీ తీసేసింది. ఇక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారో లేదో ఒక డౌట్.
ఇచ్చినా అవంతి గెలుస్తారో లేదో మరో డౌట్. దానికి తోడు అన్నట్లుగా పురి విప్పుకున్న విభేదాలు సొంత పార్టీలో ముసురుకుని అవంతిని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాయి. తాజాగా భీమిలీ నియోజకవర్గానికి గుండె కాయ లాంటి పద్మనాభం మండలంలో వైసీపీ నేతలు చాలా మంది సమావేశం అయి ఈసారి అవంతికి టికెట్ ఇస్తే అసలు పనిచేయమని తెగేసి చెప్పేశారు. అవంతిని నాన్ లోకల్ గా వారు చిత్రీకరించారు.
అవంతి 2009లో ప్రజారాజ్యం తరఫున భీమిలీలో పోటీ చేస్తే సహకరించామని, ఆయన 2014లో తన సొంత రాజకీయం చూసుకుని టీడీపీకి మారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారని, తిరిగి 2019లో వైసీపీలో చేరి భీమిలీ నుంచి పోటీ చేస్తే గెలుపునకు హెల్ప్ చేసామని అంటున్నారు.
అయితే అవంతి పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా ఎవరెవరినో తెచ్చి తన వర్గం వారిగా ప్రోత్సహిస్తున్నారని, ఆయన వల్ల స్థానికులైన వారు ఇబ్బంది పడుతున్నారని, ఆయనకు స్థానిక సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదని కూడా అంటున్నారు.
అందువల్ల వైసీపీ అధినాయకత్వం ఈసారి స్థానికులకే టికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలా కాకుండా అవంతికి టికెట్ ఇస్తే మాత్రం గెలుపు కు గ్యారంటీ ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు.
ఇదిలా ఉంటే అవంతికి జనసేన టీడీపీ రూపంలో అతి పెద్ద ప్రత్యర్ధులు రెడీగా ఉన్నారు. ఆ రెండు పార్టీలకు విడివిడిగానే గ్రాఫ్ బగుంది. ఇక ఆ రెండు పార్టీలు కలిశాయంటే మాత్రం అవంతికి చుక్కలు చూపిస్తారని భారీ తేడాతో ఓడిస్తారని కూడా అంటున్నరు. ఇపుడు వైసీపీలో వర్గ పోరుతో అవంతి సతమతం అవుతున్నారు.
తన వెంట ఉన్న వారికే ఆయన న్యాయం చేస్తున్నారని, మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారిని పట్టించుకోవడంలేదన్నది అతి పెద్ద విమర్శ. మొత్తానికి వైసీపీ వారు సహకరించక ప్రత్యర్ధులు బలంగా ఉంటే అవంతికి 2024 ఎన్నికల్లో సినిమా చూపించేస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఆ మధ్యన అవంతిని పట్టుకుని పవన్ కళ్యాణ్ బంతీ పూబంతి చామంతీ అంటూ సెటైర్లు వేశారు. ఆయన రాజకీయ ప్రత్యర్ధి కాబట్టి అలా వేశారు అనుకున్నా సొంత పార్టీలో వారు కూడా ఇపుడు అవంతితో చెలగాట ఆడుతున్నారా అన్నదే ఆయన అనుచరులకు పట్టుకున్న ధర్మ సందేహం అంటున్నారు.