‘జగనన్న ఇళ్ల’లో బెడ్ రూం, బాత్రూంలకు స్థలం సరిపోవడం లేదు: వైసీపీ ఎమ్మెల్యే

Update: 2021-06-26 15:30 GMT
నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాజాగా హౌసింగ్ పై సమీక్ష సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి రంగనాథరాజు, ఎమ్మెల్యేలు పాల్గొన్న ఈ సమీక్షలో పలు సూచనలు చేశారు.

నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ‘‘జగన్ ప్రభుత్వం కట్టిస్తున్న ‘జగనన్న ఇళ్లు’ చాలా బాగున్నాయని ఆయన అన్నారు. కానీ బెడ్ రూం విషయానికి వస్తే చిన్నగా ఉండి ఇబ్బందిగా ఉందని’’ అధికారులకు సూచించారు. కొత్తగా పెళ్లి అయిన వారికి ఈ బెడ్ రూంలు,  బాత్రూంల వల్ల  ఇబ్బందులు ఎదురవుతున్నాయని  తెలిపారు.

కేవలం ఒక మంచి కొలతలు తీసి మనం బెడ్ రూం కొలిస్తే సరిపోతుందని.. అంత చిన్నగా డిజైన్ చేశారని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. డబుల్ కాట్ మంచాలు పట్టాలంటే చాలా కష్టం అని తెలిపారు.

జగనన్న ఇళ్ల నిర్మాణంలో బాత్రూంలు బయటపెట్టించి బెడ్ రూంలు కాస్త వెడల్పు చేయిస్తే ఇంకా బాగుంటాయని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఇక పట్టణాల్లో ఆరు అంగనాలు నిర్మాణాలు చేపడుతున్నారని.. అది ఇంకా ప్రజలకు సరిపోవని.. ఇది చాలా అన్యాయం సార్ అంటూ మంత్రి, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.  ఆరు అంగనాల్లో ఇల్లు ఎలా వస్తుంది సార్.. గ్రామాల్లో 9 అంగులాలు సరిపోవు అంటూ సభ దృష్టికి తీసుకొచ్చారు.

గ్రామీణ ప్రాంతాల్లో వెడల్పుగా కట్టినట్టే పట్టణ ప్రాంతాల్లోనూ ఇంకాస్త స్థలం పెంచి కట్టించాలని ఎమ్మెల్యే నల్లపురెడ్డి సూచించారు.Full View
Tags:    

Similar News