ఆంధ్రప్రదేశ్ లో చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున 6.30 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ప్రజలు పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు. ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.
తొలి గంటలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతారు. కరోనా రోగులకు చివరి గంటల అనుమతిస్తారు.
ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాల్లో 16 రెవెన్యూ డివిజన్ల పరిధిలో 161 మండలాల్లో నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది. సమారుగా 67,75,226 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
నాలుగో విడతలో 3299 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. వాటిలో 554 ఏకగ్రీవం అయ్యాయి. ఫలితంగా ఏకగ్రీవాలు పోను మిగిలిన 2743 పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 7425 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 33435 వార్డు స్థానాలకు గాను 10921 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన స్థానాలకు ఓటింగ్ చేపట్టారు.
మూడో విడతలో చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాలుగో విడతలో సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల ఉంది. ఇప్పుడు దీనిపైనే అందరి దృష్టి నెలకొంది. వైసీపీ క్లీన్ స్వీప్ చేయడం ఇక్కడ ఖాయమంటున్నారు.