ఏపీ సీఎం ఆఫీస్ రంగంలోకి..ఎల్లోమీడియాకు తప్పుడు ఫొటోలు

Update: 2018-10-25 10:46 GMT
ఏపీ సీఎం ఆఫీస్ జగన్ పై హత్యను కూడా రాజకీయం చేస్తోంది. ఆ మకిలిని టీడీపీ ప్రభుత్వానికి అంటకుండా  తప్పుడు ప్రచారం చేస్తోంది. నిందితుడు-జగన్ ను ఫొటోను మార్ఫింగ్ చేసి నిందుతుడు జగన్ అభిమానే అని అభూత ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు టీడీపీ అనుకూల మీడియాకు లీకులు అందజేసి అసత్య ప్రచారానికి తెరదీశారు.

ఏపీ సీఎం పీఎస్ తాజాగా టీడీపీ అనుకూల మీడియాకు తప్పుడు ఫొటోలు లీక్ చేసి జగన్ హత్యను టీడీపీకి అంటకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఏపీ సీఎం ఆఫీస్ పీఎస్ తాజాగా నిందితుడు శ్రీనివాస్ రావు - జగన్ తో సాన్నిహితంగా ఉన్న ఫొటోలను మార్ఫింగ్ చేసి టీడీపీ అనుకూల ఎల్లో మీడియాకు అందజేశారు. వాటిని పట్టుకొని ఎల్లో మీడియా అభూత కల్పనలు ప్రచారం చేస్తోంది. జగన్ పై హత్యాయత్నం సంఘటన తమకు అంటకుండా టీడీపీ ఇలా అధికారులతో చేయిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైఎస్ జగన్ పై హత్యయత్నంలో టీడీపీ నేతల కోణం ఉందనే ప్రచారం జరుగుతోంది. నిందితుడు పనిచేసే రెస్టారెంట్ టీడీపీ నేతలదేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్యను తమకు అంటకుండా జగన్-నిందితుడు ఫొటోను మిక్స్ చేసి పబ్లిసిటీ కోసమే ఈ హత్యయత్నం చేశాడనేలా ప్రచారం చేయిస్తున్నారు.దీనిపై వైసీపీ నేతలు - నెటిజన్లు - ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏపీ ప్రభుత్వ దిగజారుడుతనంపై మండిపడుతున్నారు.


Tags:    

Similar News