కల్వకుంట్ల కవిత.. తెలుగు రాష్ట్రాల్లో గుర్తు పట్టని వారు.. తెలియని వారు ఎవరైనా ఉంటారా? నిజమే.. ఆమె తెలియపి వారు ఎవరుంటారు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల పట్టిగా..ఆమె అడగాలే కానీ.. దేనికైనా సరే కేసీఆర్ నో చెప్పే ఛాన్సు లేదంటారు. కేటీఆర్ తో పోలిస్తే.. కవిత కోరింది ఇవ్వటానికి ఆయన ఎక్కువ మక్కువ చూపుతారని చెబుతారు. ఈ కారణంతోనే.. ఏదైనా పని చేయించుకోవాలనుకునే వారు కేటీఆర్ కంటే కూడా కవితను ఆశ్రయిస్తారన్న మాట వినిపిస్తుంటుంది. కొన్ని ఫైళ్లకు సంబంధించి సిఫార్సులు చేయటానికి కేటీఆర్ ససేమిరా అంటారని.. అలాంటి సందర్భాల్లో కవిత చాలామందికి సాయం చేస్తారని చెబుతారు.
తండ్రి దగ్గర ఉన్న చనువే కారణమని చెబుతారు. అలాంటి కవిత తాజాగా మండలిలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆమెను మండలిలోని మిగిలిన సభ్యులకు పరిచయం చేశారు. కవితను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం. గతంలో ఎంపీగా వ్యవహరించిన ఆమె.. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం తెలిసిందే.
ఎమ్మెల్సీ అయ్యాక.. ఆమె మండలి సమావేశాల్లో పాల్గొన్నది లేదు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మొదటిసారి ఎమ్మెల్సీ హోదాలో మండలిలో అడుగు పెట్టారు. దీంతో.. ఆమెను మిగిలిన సభ్యులకు ఫార్మల్ గా పరిచయం చేశారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఆమెను అభినందించారు. ఫార్మల్ గా జరిగే కొన్ని అంశాలు భలేగా అనిపిస్తుంటాయి.