ఎన్నికల వేళ యోగికి శాంసంగ్ లక్

Update: 2021-06-22 03:29 GMT
శాంసంగ్ ఏంటి? కరోనా ఏంటి? యూపీ ముఖ్యమంత్రి యోగి ఏమిటి? అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు.కాలం కలిసి వస్తే.. ఇలాంటి అరుదైన కాంబినేషన్లు సెట్ అవుతాయి. మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళలో.. కరోనా మహమ్మారి కారణంగా చోటు చేసుకున్న డ్యామేజ్ యోగి సర్కారుకు తలనొప్పిగా మారింది. మహమ్మారి విరుచుకుపడిన వేళ.. యోగి సర్కారు సరిగా స్పందించలేదన్న విమర్శ ఉంది. భారీ ఎత్తున మరణాలకు యోగి సర్కారు వైఫల్యమని విరుచుకుపడే వారు తక్కువేం కాదు.

మరోసారి యూపీలో విజయాన్ని సాధించటం ద్వారా 2024లో కేంద్రంలో మోడీ సర్కార్ హ్యాట్రిక్ కు మినిమం గ్యారెంటీగా మారాలనుకున్న వేళ కరోనా భారీగా దెబ్బ కొట్టింది. దీంతో.. ఏం చేయాలో పాలుపోని వేళ.. అదృష్టం శాంసంగ్ రూపంలో వచ్చిందని చెప్పాలి. కొరియాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్.. తన డిస్ ప్లే తయారీ యూనిట్ ను చైనా నుంచి యూపీలోని నోయిడాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం చైనాకు షాకింగ్ గా మారితే.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు వరంగా మారినట్లు చెప్పాలి. అనుకున్న రీతిలో డెవలప్ మెంట్ జరగలేదన్న గుర్రు రాష్ట్ర ప్రజల్లో ఉన్న వేళలో.. ఒక బడా కంపెనీని రాష్ట్రానికి తెచ్చిన ఘతన యోగి ఖాతాలో ఫడనుందని చెబుతున్నారు. భారత్ లో పరిస్థితులు బాగున్నాయని.. ఇక్కడి పారిశ్రామిక వాతావరణం.. పెట్టుబడిదారుల స్నేహపూర్వక విధానాలతోనే డిస్ ప్లే యూనిట్ ను బారత్ కు మార్చినట్లుగా శాంసంగ్ చెబుతోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తాజా పరిణామం యోగి సర్కారు మైలేజీ పెంచుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News