చంద్రబాబులా కాదు : కొత్త టీడీపీని చూస్తారుట...?

Update: 2022-05-25 17:30 GMT
తెలుగుదేశం వయసు నలభై. అధినాయకుడు చంద్రబాబు వయసు ఏడు పదుల పై మాటే. అయితే చినబాబు ఏజ్ మాత్రం యంగే. ఆయన యువ రక్తం ఉరకలు వేస్తోంది. పసుపు పార్టీకి స్పీడ్ పెంచాలనుకుంటోంది. సరికొత్త దుడుకుతో పరుగులు తీయించాలనుకుంటోంది. నిజానికి ఈ జనరేషన్ కి లోకేష్ బాబు ఆలోచనలే కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయేమో.

ఆయన దేనికీ నాన్చాలనుకోరు. తనకు  ఏది తోస్తే అది అనేస్తారు. అంతే కాదు, దూకుడు కూడా మామూలుగా ఉండదు. అదే టీడీపీలో యూత్ ని కదిలిస్తోంది. ఇక చంద్రబాబు జమానాలో టికెట్లు ఇవ్వడం అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి నామినేషన్లకు  గడువు గంటలో అయిపోతుంది అని తెలిసినా కూడా ఇంకా వడపోతలతోనే గడుపుతారు.

బాబు హయాంలో హెలికాప్టర్లలో బీ ఫారాలు టీడీపీ  అభ్యర్ద్ధులకు లాస్ట్ మినిట్ లో చేరవేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కానీ చినబాబు మాత్రం నేను నాన్నలా కాదు అంటున్నారు.

ఆయన ఇపుడు టీడీపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో పాలుపంచుకుంటున్నారు. చినబాబు స్పీడ్ చూస్తే ఈ ఏడాది డిసెంబర్ నాటికి వంద నియోజకవర్గాలలో అభ్యర్ధులను ప్రకటించేలా ఉన్నారుట.

వారిని ఇప్పటి నుంచే ఎంపిక చేస్తే జనాలకు చేరువ అవుతారు, ఎన్నికల వేళకు బాగా ముందుకు వస్తారు అని నమ్ముతున్నారుట. అందుకే వంద సీట్లలో అభ్యర్ధులను ప్రకటించాలని చినబాబు తొందరపడుతున్నారు. అధినాయకుడిని కూడా తొందర పెడుతున్నారుట. అదే టైమ్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి మరో ఇరవై నుంచి పాతిక దాకా సీట్లను ప్రకటిస్తే పార్టీకి ఎంతో మేలు అని భావిస్తున్నారుట.

మరి దీని మీద చంద్రబాబు ఏమంటారో చూడాలి. నిజానికి లోకేష్ భావిస్తున్నట్లుగా ముందే టికెట్లు ప్రకటిస్తేనే చాలా లాభాలు ఉంటాయని అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో పార్టీకి కూడా కొత్త ఊపు తెస్తుంది అని అంటున్నారు. మరి లోకేష్ స్పీడ్ ని బాబు ఒకే చేస్తే మాత్రం కొత్త టీడీపీని తమ్ముళ్ళు చూస్తారు అనే అంటున్నారు.
Tags:    

Similar News