పంచాయితీ సర్పంచ్ గా గెలిచిన వెంటనే హంగు.. ఆర్భాటం మొత్తంగా మారటమే కాదు.. వాడే వాహనం పూర్తిగా మారిపోవటం తెలిసిందే. కాకుంటే.. ఇప్పుడు చెప్పే ఉదంతం ఇందుకు భిన్నం. ఎంపీగా గెలిచినప్పటికీ సొంత వాహనం లేని ప్రజాప్రతినిధిగా నిలిచారు రమ్యా హరిదాస్. కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక మహిళా ఎంపీగా ఉన్న ఆమె తాజాగా ముగిసిన ఎన్నికల్లో తొలిసారి ఎన్నికయ్యారు.
ఉలాథుర్ ఎంపీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమెకు సొంతంగా కారు లేదు. దీంతో.. క్రౌడ్ ఫండింగ్ రూపంలో నిధులు సేకరించి కారు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉలాథుర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పాలాయమ్ ప్రదీప్ తన ఫేస్ బుక్ పోస్టులో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు.
దీని ప్రకారం సాధారణ పౌరుల నుంచే కాదు.. కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చందాలు సేకరించాలని తాము భావిస్తున్నామని.. ఎవరైనా ముందుకు వచ్చి చందాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చన్నారు. దీనిపై ఎంపీ రమ్యా స్పందించారు. ఇలా క్రౌడ్ ఫండింగ్ ద్వారా కారు ఏర్పాటు చేయాలని భావిస్తున్న పార్టీ క్యాడర్ తీరుకు ఆనందం వ్యక్తం చేశారు. దీన్ని తాను గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె చెబుతున్నారు. ఏమైనా ఒక మంచి సంప్రదాయాన్ని తీసుకొస్తున్నట్లుగా చెప్పక తప్పదు.