తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రలు ఆ పేరుకు పూర్తి భిన్నంగా సాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జన చైతన్యం అంటే జనం తమ చుట్టూ జరుగుతున్న విషయాలపై చైతన్యవంతంగా ఉంటూ అవసరమైతే ప్రశ్నించడమో... పోరాడడమో... న్యాయం పొందడానికి ఇంకేదైనా మార్గం అనుసరించడమో చేయడం. కానీ... ఈ జన చైతన్య యాత్రల్లో పొరపాటున ఎవరైనా ప్రశ్నించారా... అంతే సంగతులు.. వారిని తీసుకెళ్లి జైళ్లో పెడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జన చైతన్య యాత్రలు నిర్బంధ యాత్రలుగా మారుతున్నాయి. ఉండి నియోజకవర్గంలో యాత్రల తొలిరోజే అధికార పార్టీ జనంలో అభాసుపాలయ్యింది. జనచైతన్య యాత్రలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే శివరామరాజును వంతెన సమస్యపై ప్రశ్నించిన ఒక యువకుడిని కార్యక్రమం ముగిసి ఇంటికి వెళ్లిపోయిన తరువాత పోలీసులొచ్చి స్టేషన్ కు తరలించారు. విషయం తెలిసిన స్థానికులు ఆగ్రహించి ఎమ్మెల్యేను నిలదీయడంతో ఆయన దిగిరాక తప్పలేదు. చివరకు ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. ఉండి నియోజకవర్గంలోని కలిగొట్ల గ్రామంలో మంగళవారం నిర్వహించిన జనచైతన్య యాత్రలో ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నా అనే యువకుడు గ్రామంలో వెంకయ్య వయ్యెరుపై వంతెన నిర్మించాలని కోరారు. తప్పనిసరిగా నిర్మిస్తామనిచెప్పి ఎమ్మెల్యే వెళ్ళిపోయారు. అనంతరం అక్కడేవున్న ఉండి ఎస్సై రవివర్మ ఈ విషయమై ఆ చిన్నాను హెచ్చరించారు. సమస్య గురించి అడిగితే అరెస్టు చేస్తారా అని చిన్నా ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత చిన్నా ఇంటికి వెళ్లి - అతడిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని స్టేషన్ కు తరలించారు.
దీంతో ‘ప్రజా సమస్యపై ప్రశ్నిస్తే అరెస్టుచేసేస్తారా’ అంటూ గ్రామంలోని యువకులు పోలీసు స్టేషను వద్ద ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేనూ దీనిపై కొందరు నిలదీశారు. వెంటనే ఆయన పోలీసులతో మాట్లాడి ఆ యువకుడిని విడిపించారు. అయితే... చైతన్య యాత్రల పేరుతో ఈ నిర్బంధ విధానాలేమిటన్న ప్రశ్న అంతటా వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/