బాబుకు ఆప్షన్ లేకుండా జగన్ డేరింగ్ స్టెప్

Update: 2019-07-10 08:34 GMT
ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. ప్రతిపక్షంలోని టీడీపీ.. ప్రభుత్వం ఏపీ ప్రభుత్వ పాలన తీరుపై విమర్శలకు తావు లేకుండా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పాలన పారదర్శకంగా చేసేందుకు వీలుగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ప్రభుత్వ పాలనలో ఎటువంటి అక్రమాలు, అవినీతికి తావు లేదని నిరూపిస్తూ జగన్ శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు నిర్ణయించారు.  ఈ మేరకు తాజాగా మంత్రులతో భేటి అయిన జగన్ శాఖల వారీగా శ్వేత పత్రాల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితితోపాటు పాలనా వ్యవహారాలపై శ్వేతపత్రాలను విడుదల చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమైంది. మంత్రులతో సమీక్ష నిర్వహించిన జగన్ ఆయా శాఖల్లో చేపట్టిన పనులు, కాంట్రాక్టులు, ప్రభుత్వ నిధులు , వ్యయ లెక్కలను అందులో పొందుపరచాలని ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, లోటును ప్రజల ముందుంచాలని నిర్ణయించారు.

గడిచిన చంద్రబాబు ప్రభుత్వంలో కూడా శ్వేత పత్రాల విడుదల కార్యక్రమం ప్రభుత్వ ముగింపు వేళ చేసింది. సీఎంగా చంద్రబాబు చివరలో ఇలా శ్వేతపత్రాలను విడుదల చేశారు. అయితే జగన్ మాత్రం తొలి నుంచే ఆ ఒరవడికి శ్రీకారం చుట్టారు.

కాగా ఏపీ సీఎం జగన్ శ్వేత పత్రాల విడుదలను పరిశీలించాక అందులోని తప్పు ఒప్పులపై స్పందిస్తానని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆ పార్టీ నేతలతో అన్నట్టు తెలిసింది.

    
    
    

Tags:    

Similar News