ఎన్నికల ప్రచారం చివరి నిమిషంలో కూడా నేతల మాటల తూటాలు పేలాయి. ఒకరి తీరును మరొకరు ప్రశ్నించుకున్నారు ప్రధాన పార్టీల నేతలు. అందులో భాగంగా తిరుపతి ఎన్నికల ప్రచార సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు ప్రచార పర్వం పై స్పందిస్తూ.. టీడీపీ ప్రచారం కోసం చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడి నేతలనో పిలిపించుకుని వచ్చిన అంశాన్ని జగన్ ప్రస్తావించారు.
వచ్చిన నేతలంతా రాజకీయ ప్రసంగాలు చేశారు. చంద్రబాబు నాయుడును పొడిగారు. కొందరు అయితే జగన్ మీద కూడా బురదజల్లి వెళ్లారు. అయితే వారిలో ఎవరూ ఏపీ ప్రజలకు ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోయారు. ఆ అంశాన్నే జగన్ ప్రస్తావించారు.
'అంతమంది అద్దె నేతలను ప్రచారానికి తెచ్చుకున్నావుగా బాబూ.. వారిలో ఎవరి చేతనైనా ఏపీకి ప్రత్యేకహోదాకు మద్దతును పలికించగలిగావా..' అని జగన్ ప్రశ్నించారు. 'హోదా పై అద్దెనేతలు మద్దతును ఇచ్చారా?' అంటూ ప్రశ్నించారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్ధుల్లా, దేవేగౌడ.. వీళ్లంతా చంద్రబాబు నాయుడు తరఫున ప్రచారానికి ఏపీకి వచ్చారు. వారి వారి కులాల వారు ఏపీలో ఎక్కడ ఎక్కువగా ఉంటుందనే చోట వారి చేత ప్రచారం చేయించారు తెలుగుదేశం వారు.
అయితే వారెవరూ ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో మాట్లాడలేదు. వాళ్లంతా వచ్చి మోడీని తిట్టారు, చంద్రబాబును పొగిడారు.. వెళ్లారు. అయితే ఎవరూ కూడా ఏపీకి మద్దతుగా నిలుస్తామని, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో సహకరిస్తామంటూ.. ప్రకటనలు చేయలేదు. ఈ అంశాన్నిజగన్ ప్రస్తావించారు.
ఇక ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో దేవేగౌడ పార్టీ వాళ్లు పూర్తిగా వ్యతిరేకం. ఇక ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచి.. ఏపీకి నీళ్లు రాకుండా చేసిన ఘనుడు దేవేగౌడ. అలాంటి వారు చంద్రబాబు నాయుడుకు మద్దతు పలకడం విశేషమే!